Breaking News

ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం.. మేకిన్‌ ఇండియాను సాధిద్దాం: ప్రధాని మోదీ

Published on Tue, 05/27/2025 - 19:21

గాంధీనగర్:  మనం మేకిన్‌ ఇండియాను సాధించాలంటే మన దగ్గర తయారు చేసిన వస్తువులనే కొందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ మార్కెట్‌ను విపరీతంగా పంచేస్తున్న మనం..  ఇక నుంచి మన మార్కెట్‌కే పెద్ద పీఠ వేయాలయన్నారు. ఈ రోజు(‍మంగళవారం) గుజరాత్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తయారు చేసే విదేశీ తరహా వస్తువుల్ని కొనాల్సిన అవసరం లేదనే సంకేతాలిచ్చారు. 

ఇక నుంచి ఏ వస్తువైనా మేడిన్ ఇండియాది అయితేనే కొందామని దేశ ప్రజలకు విజ‍్క్షప్తి చేశారు. హెలీ, దీపావళి, గణేష్ చతుర్థి.. ఏ పండుగ అయినా మేడిన్ వస్తువులనే కొందామంటూ ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. ‘  దేశ ప్రజలకు ఇదే నా విన్నపం. ప్రొడక్టులు కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కొనండి. మన ఇండియా వస్తువులనే ఇక నుంచి ఎక్కువగా వాడదాం. అవసరం అయితే తప్పితే దిగుమతులుపై పెద్దగా ఆధాపడవద్దు. చైనా ప్రొడక్టులు అస్సలే కొనొద్దు.  వస్తువులు కొనేటప్పుడు చైనా డంప్ ను తనిఖీ చేయండి. ఆపరేషన్ సిందూర్ అనేది 140 కోట్ల భారతీయల బాధ్యత’ అని మోదీ స్పష్టం చేశారు.

మనం విదేశీ మార్కెట్‌ను పెంచుతున్నాం.. గ్రహించండి
భారత మార్కెట్లను విదేశీ దిగుమతులు  ఏ రకంగా  ముంచెత్తుతున్న ఉదాహరణలను ఉటంకిస్తూ, దురదృష్టవశాత్తు, గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుండే వస్తున్నాయి, చిన్న కళ్ల గణేష్ విగ్రహాలు కూడా కళ్ళు సరిగ్గా తెరవవు. హోలీ రంగులు కూడా విదేశీ తయారీవే. అవి తక్కువ ధరకే రావడంతో మనం వాటిని కొనేస్తున్నాం.. వారి మార్కెట్ ను ఇక్కడ పెంచుతున్నాం. ఇక్కడ మన కళాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక నుంచి వాటికి దూరంగా ఉండండి. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి’ అని పేర్కొన్నారు.

ఇది మీకు టాస్క్..
తాను దేశ ప్రజలకు ఒక టాస్క్ ఇస్తున్నానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ‘ ఇక నుంచి ప్రతీ భారతీయుడు చేయాల్సిన టాస్క్ ఒకటి ఉంది. మన రోజువారీ జీవితంలో విదేశీ వస్తువుల్ని ఎన్ని వాడుతున్నాం అనేది లిస్ట్ రాసుకోండి. ఒక భారతీయుడిగా మీకు ఇస్తున్న టాస్క్ ఇది. 24 గంటల్లో విదేశీ వస్తువుల్ని ఎన్ని కొన్నాం అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోండి. అయితే ఇక్కడ ఏది విదేశీ వస్తువు అనేది మీరు గ్రహించలేరు. మీరు కొనే హెయిర్ పిన్, దువ్వెన కూడా విదేశీ వస్తువే అనేది గ్రహించండి. 

ఇంతలా విదేశీ వస్తువులు కొనడానికి మొగ్గుచూపుతున్నాం. మేడిన్ ఇండియా ప్రొడక్టులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ ను మీరు రక్షించాలనుకుంటే ఇక నుంచి మన వస్తువుల్నే ఎక్కువగా కొందాం. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రతీ పౌరుడు ఇది చేయాలి. భారత్ మరింత ఎదగాలంటే ఇది తప్పనిసరి. పాకిస్తాన్ కుట్రకు బదులిచ్చిన ఆపరేషన్ సిందూర్ అనేది మన బలగాల బాధ్యతే కాదు. 140 కోట్ల దేశ ప్రజల బాధ్యత అనేది గుర్తుంచుకోండి’ అని మోదీ పేర్కొన్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)