Breaking News

61 శాతం భారత్‌ భూకంప జోన్‌లోకి..

Published on Sun, 11/30/2025 - 04:28

ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించిన భూకంపాలు త్వరలో భారత్‌పైకీ విరుచుకుపడే ప్రమాదం హెచ్చుగానే కనిపిస్తోంది. దేశంలో ఏకంగా 61 శాతం ప్రాంతం సాధారణం నుంచి ప్రమాదకర భూకంప రిస్కు పరిధిలోకి చేరడమే ఇందుకు కారణం. 

కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) కొత్తగా సవరించిన భూకంప డిజైన్‌ కోడ్‌ ఈ ప్రమాదకర విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, పొంచి ఉన్న భూకంప ప్రమాద తీవ్రతను తెలియజెప్పేందుకు కొత్తగా ‘అత్యంత ఎక్కువ రిస్కు’జోన్‌ కేటగిరీని కూడా చేర్చింది. మొత్తం హిమాలయ ప్రాంతమంతటినీ జోన్‌–6గా పేర్కొన్న ఈ కేటగిరీలోకే చేర్చడం మరింత ఆందోళన పడాల్సిన అంశం! 

ఇప్పడేం మారింది?  
హిమాలయాలు గతంలో 4, 5 జోన్ల పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతమంతా నిజానికి ఒకే టెక్టానిక్‌ పలకపై ఉన్నా భూకంప రిస్కు తీవ్రతలో తేడా ఆధారంగా అప్పట్లో అలా విభజన చేశారు. అయితే ఆ క్రమంలో భూ లోతుల్లోని పొడవాటి అగాధపు ప్రాంతాలతో పొంచి ఉన్న ముప్పును సరిగా మదింపు చేయడంలో విఫలమైనట్టు సైంటిస్టులే అంగీకరిస్తున్నారు. 

ముఖ్యంగా మధ్య హిమాలయ ప్రాంతాల్లో పలు అత్యధిక భూకంప రిసు్కన్న పలు భూభాగాలు ఈ తప్పిదం వల్ల సాధారణ రిసు్కన్నవిగా పరిగణన పొందుతూ వచ్చాయి. దాన్నిప్పుడు సరిచేసినట్టు బీఐఎస్‌ వెల్లడించింది. నిజానికి మధ్య హిమాలయ ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాల్లో భూకంపం జాడలు కూడా కని్పంచలేదు. అంత మాత్రాన అక్కడ అంతా సజావుగా ఉన్నట్టు అసలే కాదని బీఐఎస్‌ పేర్కొంది. 

ఎందుకిలా డేంజర్‌ జోన్‌లోకి? 
హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఢీకొట్టే టెక్టానిక్‌ పలకల సరిహద్దులపై ఉన్నాయి. మరోలా చెప్పాలంటే ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశమున్న మందుపాతరపై ఉన్నాయన్నమాట. ఇండియన్‌ టెక్టానిక్‌ ప్లేట్‌ నిరంతరం యురేíÙయన్‌ ప్లేట్‌లోకి చొచ్చుకుపోతూ వస్తోంది. ఫలితంగా ఏటా కనీసం 5 సెంటీమీటర్ల మేరకు అందులోకి చొరబడుతూ వెళ్తోంది. రెండు ప్లేట్లు ఢీకొంటున్న కారణంగానే అక్కడ భూ ఉపరితలం పైపైకి పెరుగుతూ వస్తోంది. 

హిమాలయాల ఆవిర్భావానికి మూలకారణం కూడా ఇదే. ఎవరెస్టుతో పాటు ప్రపంచంలోకెల్లా పలు పర్వత శిఖరాలు హిమాలయాల్లోనే ఉండేందుకూ ఇదే కారణం. కనుక అవి చల్లగా కని్పంచేది కేవలం పైకి మాత్రమే. ఈ టెక్టానిక్‌ ఒత్తిడి మూలంగా హిమాలయ గర్భమంతా నిత్యం అలజడిమయంగానే ఉంటూ ఉంటుంది. టెక్టానిక్‌ పలకల పరస్పర తాకిడి భూ కేంద్రంపైనా విపరీతమైన ఒత్తిడికి కారణమవుతోంది.

ఆ ఒత్తిడి ఎప్పుడో ఓసారి హఠాత్తుగా విడుదలవుతుంటుంది. అది కాస్తా అత్యంత శక్తిమంతమైన భూకంపాల రూపంలో పైకి ఎగదన్నుకొస్తుంది. ఇది చాలదన్నట్టు భూమ్మీద అత్యంత అస్థిరమైన పర్వత ప్రాంతం హిమాలయాలే. వయసుపరంగా అన్ని పర్వతాల కంటే చిన్నవి కూడా. దాంతో హిమాలయాల్లోని రాళ్లు తదితరాలు నిత్యం అటూఇటూ మంద్రస్థాయిలో కదలాడుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ గనక భూకంపం సంభవిస్తే అతి అత్యంత ప్రాణాంతకమే అవుతుంది. 

అంతా అక్కడే! 
మెయిన్‌ బౌండరీ, మెయిన్‌ సెంట్రల్, మెయిన్‌ ఫ్రంటల్‌... ఇలా భూ కేంద్రంలోని ప్రధాన ఫాల్ట్‌ సిస్టమ్స్‌ (భారీ రంధ్రాలని చెప్పుకోవచ్చు)లో అతి పెద్దవన్నీ హిమాలయాల కిందే కేంద్రీకృతమై ఉన్నాయి. అంతేగాక పలు భూకంప విరామ ప్రాంతాలు (కొన్ని శతాబ్దాలుగా అసలు భూకంపమే రానివి) కూడా హిమాలయాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు.

 అలాంటి ప్రాంతాల్లో భారీ భూకంపానికి ఎప్పుడైనా ఆస్కారం పుష్కలంగా ఉంటుందట. కర్ణుని చావుకు మాదిరిగా ఇన్ని కారణాలు కలగలిసి హిమాలయాలను ప్రపంచంలోకెల్లా భూకంప రిస్కు అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలోకి చేర్చేశాయి. హిమాలయాల్లోని డెహ్రాడూన్, మొహంద్‌తో పాటు మొత్తం ఉత్తరాఖండ్‌ అంతా తాజాగా భూకంప డేంజర్‌ జోన్లోకి వచి్చంది. అక్కడ జనాభా నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది.   
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు