Breaking News

G20 Summit: 78 భిన్న వాయిద్యాలతో సంగీత సౌరభం!

Published on Fri, 09/08/2023 - 04:54

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ నేతలకు వీనుల విందైన సంగీతం వినిపించేందుకు వాయిద్యకారులు సిద్ధమయ్యారు. భారతీయ సంగీత వారసత్వ సంపద ఎంతటి గొప్పదో ప్రత్యక్షంగా చూపేందుకు సమాయత్తమయ్యారు. శాస్త్రీయ సంగీతంతోపాటు సమకాలీన సంగీతంలో వినియోగించే భిన్న వాద్య పరికరాలతో సంగీత విభావరి అతిథులను ఆకట్టుకోనుంది. గాంధర్వ ఆతిథ్యం బృందం ‘భారత వాద్య దర్శనం’ పేరిట గొప్ప ప్రదర్శన ఇవ్వనుంది.

జీ20 దేశాధినేతలకు సెప్టెంబర్‌ తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో ఈ సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంతూర్, సారంగీ, జల్‌ తరంగ్, షెహనాయ్‌ ఇలా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన మొత్తం 78 రకాల వాద్య పరికరాల నుంచి ఉద్భవించే అద్భుతమైన సంగీతం ఆహుతులను అలరించనుంది. ‘సంగీత మార్గంలో భారత్‌ సాగించిన సామరస్య ప్రయాణం తాలూకు అపురూప జ్ఞాపకాలను ఇప్పుడు మరోసారి గుర్తుచేస్తాం’ అని ఆహా్వన ప్రతి సంబంధ బ్రోచర్‌ కాన్సెప్ట్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రదర్శన విలాంబిత్‌ లయతో మొదలై మధ్య లయలో కొనసాగి ధృత లయతో ముగుస్తుంది.

ఈ వాయిద్య పరికరాల సమ్మేళనంలో 34 హిందుస్తానీ సంగీతం తాలూకు వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత సంబంధ పరికరాలు, 26 జానపద సంబంధ పరికరాలు వినియోగిస్తున్నారు. 11 మంది చిన్నారులు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువకులు, 22 మంది నిష్ణాతులుసహా 78 మంది కళాకారులు ఈ వాద్య పరికరాలను వాయిస్తారు. తమ ప్రాంత విశిష్ట వారసత్వ సంగీత సంపదను ఘనంగా చాటుతూ భిన్న ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయక వేషధారణలో వేదకాలంనాటి పరికరాలు, గిరిజనుల, జానపదుల పరికరాలతోపాటు లలిత సంగీతం తాలూకు పరికరాలు వాయిస్తారు. 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)