Breaking News

Bihar: ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు

Published on Sun, 03/10/2024 - 10:51

పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు  ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్య అనుచరుడు, ఇసుక మైనింగ్‌ వ్యాపారి సుభాష్‌యాదవ్‌ను ఈడీ శనివారం(మార్చ్‌ 9) రాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో శనివారం తెల్లవారుజాము నుంచే సుభాష్‌యాదవ్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు జరిపింది.

ఈ సోదాలు ముగిసిన తర్వాత సుభాష్‌యాదవ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో రూ.2.30కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇసుక అక్రమ మైనింగ్‌, అమ్మకాల ద్వారా రూ.161 కోట్లు ఆర్జించినట్లు సుభాష్‌యాదవ్‌కు చెందిన కంపెనీపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్టు చేసింది.

కాగా, 2019లోక్‌సభ ఎన్నికల్లో సుభాష్‌ యాదవ్‌ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో మార్చి 3న జరిగిన మహాబంధన్‌ జనవిశ్వాస్‌ మహా ర్యాలీలో సుభాష్‌ యాదవ్‌ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. 

రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చర​చర్చనీయాంశమయ్యాయి.   

ఇదీ చదవండి.. యూపీలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు