Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. అగ్ర నేత రేణుక మృతి

Published on Mon, 03/31/2025 - 15:19

రాయ్‌పూర్‌ : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతల్ని కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రెస్‌ టీమ్‌ ఇన్‌ఛార్జ్‌ మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక మరణించారు.  

దంతెవాడ- బీజాపూర్‌ బోర్డర్‌లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ- బీజాపూర్‌ బోర్డర్‌ తుపాకుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి మరణించినట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్‌ రాయ్‌ అధికారికంగా ప్రకటించారు. రేణుక తెలంగాణలోని వరంగల్ జిల్లా జనగామ నివాసి. ఆమె తలపై రూ.25లక్షల రివార్డ్‌ ఉన్నట్లు చెప్పారు. కాల్పుల అనంతరం, ఆటోమెటిక్‌ ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 135మంది మావోయిస్టులు మృతి చెందగా.. గతేడాది 219మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.  

ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్‌ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.

  • ఫిబ్రవరిలో బీజాపూర్‌ జిల్లాలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు.  
  • బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్‌జీ జవాన్‌ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్‌ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
  • మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యంగా ఆపరేషన్ కగార్‌(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్‌ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)