Breaking News

భర్త ఆదాయం రూ.40 లక్షలైనా.. భార్యకు భరణం నో!

Published on Thu, 11/05/2026 - 11:07

ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగంలో ఉంటూ ఆర్థిక స్థిరత్వం సాధించిన మహిళ భర్త నుంచి జీవనభృతి పొందడానికి అర్హురాలు కాదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. భార్యకు నెలకు రూ.20వేల జీవనభృతి ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. బెంగళూరుకు చెందిన టెక్కీ దాఖాలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌  సుమలతతో కూడిన ధర్మాసనం పై మేరకు తీర్పు ఇచ్చింది.

భర్త వార్షిక ఆదాయం రూ.40 లక్షలు ఉందని, ఆయన నుంచి నెలకు రూ.85 వేలు జీవనభృతి చెల్లించాలని భార్య ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌  దాఖలు  చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. భార్యకు నెలకు రూ.20 వేలు ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ భర్త హైకోర్టుకు ఆశ్రయించాడు. (బిఎన్‌ఎస్‌ఎస్‌)–2023 నిబంధన ప్రకారం కుటుంబ న్యాయస్థానం తీర్పు సమర్థవంతంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. 

 కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన సదరు మహిళకు నెలకు రూ.54,700 వేతనం వస్తుందని,  మంచి ఆర్థిక స్థోమత కలిగి ఉంటూ  స్వంతకాళ్లపై జీవించే సామర్థ్యం  ఉన్నందున భర్తపై ఆధారపడినట్లుగా భావించలేమని హైకోర్టు పేర్కొంటూ కుటుంబ న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.  కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన రూ.20వేల మెయింటినెన్స్‌ ఆర్డర్‌ రద్దు  చేసినప్పటికీ ఒక కీలక ఆదేశాన్ని కోర్టు ఇచ్చింది. భర్త ఇప్పటివరకు చెల్లించిన మెయింటినెన్స్‌ మొత్తాన్ని తిరిగి వసూలు  చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. 

-కర్ణాటక

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)