Breaking News

వీడియో వైరల్‌.. దెబ్బకు దేవుడు కనిపించడమంటే ఇదే..

Published on Wed, 07/05/2023 - 17:51

లక్నో: మనుషులు చేసే కొన్ని చేష్టలు అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకు వస్తాయి. ముఖ్యంగా జంతువుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. జంతువుల విషయంతో ఓవర్‌గా బిహేవ్‌ చేస్తే అవి ఇచ్చే రియాక్షన్‌ మామూలుగా ఉండదు మరి.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ముగ్గురు వ్యక్తులు ఏనుగులతో సెల్ఫీలు దిగుదామని డేర్‌ చేసి అతి చేశారు. 

దీంతో, గజరాజులకు మండిపోయి.. వాటి వెంటపడ్డాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ.. లేస్తూ.. పడుతూ.. ఏనుగుల దాడి నుంచి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. యూపీలోని లఖింపూర్‌ ఖేరీ జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు నేపాల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో దుద్వా టైగర్‌ రిజర్వ్‌ నుంచి వెళ్తుండగా అక్కడ ఏనుగుల గుంపు వారికి కనిపించింది. ఇంకేముంది.. వారి చేతిలో సెల్‌ఫోన్స్‌ తీసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో, వారి చేష్టలకు ఏనుగులకు చిర్రెత్తుకొచ్చింది. అనంతరం.. ఏనుగులు ఒక్కసారిగా వారి పైకి దూసుకొచ్చాయి. వెంటనే వణికిపోయి భయంతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు తీశారు. ఈ క్రమంలో పరుగులో అదుపుతప్పి ఓ వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఎలాగోలా ఏనుగుల బారినుంచి వారు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: వీడియో: ఫారినర్‌ను అసభ్యంగా తాకుతూ ఆ ఆటోడ్రైవర్‌ వేధింపులు.. వైరల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)