Breaking News

రాంచీలో గజరాజు సంచారం 

Published on Sat, 02/28/2026 - 03:59

రాంచీ: జార్ఖండ్‌ రాజధాని రాంచీలో శుకవ్రారం ఉదయాన్నే ఓ గజరాజు అలజడి రేపింది. ఉదయం 5 గంటలప్పుడు నగర శివార్లలో కనిపించిన ఆ ఏనుగు 5 గంటలపాటు నివాస ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బిర్సా చౌక్, రాంచీ విమానాశ్రయం ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగును అటవీ సిబ్బంది ఉదయం 10 గంటల సమయానికి విజయవంతంగా అడవిబాట పట్టించగలిగారు.

 మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి ప్రవేశించింది. ‘దారి తప్పిన ఆ ఏనుగు నగరంలోకి ప్రవేశించింది. ఉదయం వేళ చిన్నారులు స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం’అని రాంచీ డివిజన్‌ అటవీ అధికారి శ్రీకాంత్‌ వర్మ చెప్పారు. ఎటువంటి నష్టం జరగలేదన్నారు. హల్హు అటవీ ప్రాంతం నుంచి ధుర్వా వైపు తరచూ ఏనుగులు వస్తున్నాయని వివరించారు. 

2024 జూన్‌లోనూ ఏనుగొకటి మొదటిసారిగా నగరంలోకి ప్రవేశించిందని గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర అసెంబ్లీ సమీపంలోకి వచి్చందన్నారు. అదేవిధంగా, నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న రటులోని పాడుబడ్డ శీతల గిడ్డంగిలోకి రెండు ఏనుగులు ప్రవేశించాయన్నారు. 2013లోనూ రాంచీ సిటీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఒక ఏనుగు సంచరించిందని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది నెలల్లోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏనుగుల దాడి ఘటనల్లో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని వర్మ తెలిపారు.  
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)