Breaking News

Jharkhand: ఏనుగు దాడి.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Published on Wed, 01/07/2026 - 11:22

సింఘ్‌భూమ్: జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఎనిమిది నెలల పసికందు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. తెల్లవారుజామున గోయిల్కేరా బ్లాక్‌లోని సోవాన్ గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఒక ఏనుగు గ్రామంలోని ఒక గుడిసెపై దాడి చేసి, అందులో నిద్రిస్తున్న వారిని తొక్కి చంపేసింది. ఈ ఘటనలో కుంద్రా బాహదా, అతని కుమార్తె కొద్మా బాహదా, కుమారుడు సాము బాహదా అక్కడికక్కడే మృతి చెందారు. 

ప్రమాదం నుంచి కుంద్రా భార్య తృటిలో తప్పించుకోగా, మరో కుమార్తె జింగీ బాహదా తీవ్ర తల గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలో గత ఆరు రోజులుగా ఏనుగుల దాడులు మరింతగా పెరిగాయి. తాజా మరణాలతో కలిపి ఈ వారంలో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.  ఈ తరహా ఘటనల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  గోయిల్కేరా బ్లాక్  ఏనుగుల దాడులకు కేంద్రబిందువుగా మారింది. మంద నుండి విడిపోయిన ఒక ఏనుగు గ్రామాల్లోకి చొరబడి ఇళ్లను ధ్వంసం చేస్తూ, నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను నాశనం చేస్తోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

తాజాగా ఏనుగు దాడి జరిగిన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 20,000 నగదును అందజేశారు. ఏనుగును అడవిలోకి పంపేందుకు పశ్చిమ బెంగాల్ నుండి ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించారు. అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్థానికులకు సూచించారు. అటవీ ఆక్రమణలు, ఆహారం లభించకపోవడం తదితర కారణాలతో ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఎనిమిదో వింత: కమలంతో కాంగ్రెస్ దోస్తీ! 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)