Breaking News

నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు 

Published on Sat, 02/08/2025 - 04:52

న్యూఢిల్లీ: హస్తిన అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 19 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 

ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాము వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యమని ఆమ్‌ ఆద్మీ పారీ్ట(ఆప్‌) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఆ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టంచేశాయి. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్‌ ఈసారి ఆప్, బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు.  

కేజ్రీవాల్‌ ఇంటికి ఏసీబీ అధికారులు  
ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’ ప్రారంభించిందని, తమ అభ్యర్థులను ప్రలోభపెట్టడానికి ప్రయతి్నస్తోందని, ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున నగదు, మంత్రి పదవులు ఇవ్వజూపిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనాకు సైతం ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలపై వి.కె.సక్సేనా స్పందించారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ఏసీబీ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిరోజ్‌షా రోడ్డులోని కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో అధికారులు లీగల్‌ నోటీసు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు సమరి్పంచాలని పేర్కొన్నారు.   
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)