UP By Election : సంఘ్‌ చేతికి బీజేపీ ఉప ఎన్నికల బాధ్యతలు

Published on Thu, 08/22/2024 - 11:37

మొన్నటి యూపీ లోక్‌సభ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాల తర్వాత బీజేపీలో అంతర్గత పోరు చోటుచేసుకుంది. ఇప్పుడు దీనిని ఆపేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌, సంఘ్‌ నేత అరుణ్‌కుమార్‌ల సమక్షంలో సమావేశం జరిగింది.

ప్రభుత్వం- సంఘ్‌ మధ్య మెరుగైన సమన్వయంతో పాటు ఉప ఎన్నికల వ్యూహం, పార్టీ ప్రతినిధుల నియామకం తదితర పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల సన్నాహాల్లో బీజేపీతో పాటు సంఘ్ కార్యకర్తలను కూడా భాగస్వాములను చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

దాదాపు రెండున్నర గంటల పాటు సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో..  పార్టీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు బీజేపీ నష్టపోవాల్సి వస్తుందని సంఘ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలతో పాటు ప్రభుత్వం, సంఘ్‌ మధ్య పరస్పర సమన్వయంపై చర్చ జరిగింది. రాబోయే ఉప ఎన్నికల్లో కీలక బాధ్యతలను సంఘ్‌కు అప్పగించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)