Breaking News

టీనేజ్‌ డ్రైవర్‌ : విషాదాంతమైన గోవా టూర్‌, వీడియో వైరల్‌

Published on Wed, 02/25/2026 - 10:55

గోవాలోని అందమైన ప్రదేశాలను చూసి తరించాలని ఆశపడిన టూరిస్టు  కుటుంబంలో ఘోర  రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గోవాలోని అస్సాగావ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

భోపాల్‌కు చెందిన 65 ఏళ్ల పర్యాటకుడు భగత్‌రామ్ శర్మ (65)  కుటుంబంతో కలిసి హ్యుందాయ్ i20 కారులో గోవాకు  బయలుదేరారు.ఉత్తర గోవాలోని 'హ్యాపీ బార్' జంక్షన్ వద్ద అతివేగంతో వచ్చిన ఒక అద్దె మహీంద్రా థార్ (Thar) కారు, పర్యాటకులు వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు భగత్‌రామ్  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు.  కారులో ఉన్న ఐదు నెలల చిన్నారి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడింది.

సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ప్రకారం, థార్‌లోని ఒక యువకుడు ఫోన్‌లో మాట్లాడుతూ "నాన్న, నేను ఇంటర్సెక్షన్ దగ్గర ఉన్నాను..." అని చెప్పడం వినిపించింది. కారు వెనుక సీట్లో ముగ్గురు  యువతులు  ఉన్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే థార్ కారులోని వ్యక్తులు సీట్లు మారడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అసలు డ్రైవర్‌ను (నిందితురాలిని) కాపాడేందుకు వారు ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 19  ఏళ్ల   టీనేజరే ఈ విషాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అద్దె వాహనాన్ని సీజ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ , నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైనట్లు కేసు నమోదు చేశారు. అలాగే  నిజంగా డ్రైవర్‌ను మార్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంక్షన్ వద్ద ఉన్న CCTV ఫుటేజీని, ఫోరెన్సిక్ సాక్ష్యాలను ,ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను సేకరిస్తున్నారు.

 t>

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)