Breaking News

‘మహా’ సీఎంపై పీటముడి!

Published on Mon, 11/25/2024 - 05:08

ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్‌నాథ్‌ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ కూడా తం ఆ పోస్టుపై కన్నేసినట్టు చెబుతున్నారు.

 బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న మహాయుతి ఎమ్మెల్యేల భేటీపైనే అందరి కళ్లూ నిలిచాయి. ఈ భేటీలోనే కొత్త సీఎంను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. 

ఈ నేపథ్యంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. మూడు పార్టీల అగ్రనేతలు ఆదివారం తమ ఎమ్మెల్యేలతో చర్చల్లో మునిగితేలారు. ఎన్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అజిత్‌ను ఆ పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నూతన సీఎంను మహాయుతి నేతలతో కలిసి తమ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావంకులే చెప్పారు. 

బ్రాహ్మణ సామాజికవర్గానికి ఫడ్నవీస్‌కు కుల సమీకరణాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానిదే అన్నింటా పైచేయి. ఇప్పటిదాకా సీఎంగా చేసిన వారిలో ఏకంగా 13 మంది ఆ సామాజికవర్గానికి చెందినవారే. 

ఈసారి కూడా తమ సామాజిక వర్గానికే సీఎం పీఠం దక్కాలని వారు ఆశిస్తున్నారు. ఫడ్నవీస్‌ను మరోసారి సీఎం చేయాలన్న ఆలోచనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరాఠా వ్యతిరేకిగా ఆయనకున్న ఇమేజీని గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 30 శాతం కాగా బ్రాహ్మణులు 10 శాతమున్నారు. మనోహర్‌ జోషీ తర్వాత మహారాష్ట్ర సీఎంగా చేసిన రెండో బ్రాహ్మణ నేతగా ఫడ్నవీస్‌ నిలిచారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)