Breaking News

Bihar: పట్టాలు తప్పిన గూడ్స్ .. ఎనిమిది వ్యాగన్లు తిరగబడి..

Published on Sun, 12/28/2025 - 09:45

హాజీపూర్: బీహార్‌లోని హాజీపూర్ పరిధిలో రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిదికి పైగా వ్యాగన్లు పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి తూర్పు మధ్య రైల్వే పరిధిలో జరిగిన ఈ ఘటనతో అటు అప్, ఇటు డౌన్ లైన్లలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రమాదం జరిగిందిలా..
తూర్పు రైల్వేలోని అసన్సోల్ డివిజన్ పరిధిలో గల లాహబోన్- సిముల్తాలా స్టేషన్ల మధ్య శనివారం రాత్రి 11:25 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో (సీసీఆర్‌ఓ)వెల్లడించారు. గూడ్స్ రైలులోని ఎనిమిది వ్యాగన్లు ఒక్కసారిగా పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అసన్సోల్, మధుపూర్, ఝాఝా ప్రాంతాల నుండి సహాయక  బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం  యుద్ధప్రతిపాదికన రైలు పట్టాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.  సాధ్యమైనంత త్వరగా రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

ఇటీవలి ఘటనలు..
మొన్న డిసెంబర్ 16న జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)కు చెందిన గువా సైడింగ్‌లో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజాన్ని రవాణా చేసే ఈ రైలులోని ఒక బోగీ పట్టాలు తప్పడంతో ఖనిజ రవాణాకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. అయితే, ఇది ప్రధాన మార్గంలో జరగకపోవడంతో సాధారణ రైళ్లపై దీని ప్రభావం పడలేదు. డిసెంబర్ 20న అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఎనిమిది ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు రైలు ఇంజిన్‌తో పాటు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఈ ఐదు ఘటనలు చాలు.. ‘టాటా’ రియల్‌ హీరో.. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)