జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
Breaking News
పిక్నిక్లో ఘోర విషాదం.. 8 మంది దుర్మరణం
Published on Tue, 06/10/2025 - 16:14
విహారయాత్ర పెను విషాదం నింపింది. మంగళవారం రాజస్తాన్ బనాస్ నదిలో నీట మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. వీళ్లంతా స్నేహితులు కాగా.. 25-30 ఏళ్ల మధ్య వయస్కులు కావడం గమనార్హం.
బక్రీదు తర్వాత జైపూర్ ఘాట్గేట్, హసన్పుర ప్రాంతానికి చెందిన కొంత మంది స్నేహితులు టోంక్ జిల్లా బనాస్ నది వద్దకు విహార యాత్రకు వచ్చారు. వీళ్లలో ముగ్గురు నది ఒడ్డునే ఉండి వంటలు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తమతో వచ్చిన వాళ్లు నీట మునిగిపోతూ కేకలు వేయసాగారు. దీంతో ఒడ్డున ఉన్న వాళ్లు స్థానికులను అప్రమత్తం చేశారు.
స్థానికులు వారినే కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆ 8 మంది ఊపిరి ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్చామని, వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని టోంక ఎస్పీ వికాస్ సంగ్వాన్ పీటీఐకి తెలిపారు. అయితే..
ఒకేసారి అందరూ ఒకేసారి ఎలా నీట మునిగారనే దానిపై స్పష్టత లేదని అన్నారాయన. లోతు అంచనా వేయకుండా దిగి ఉంటారని, బహుశా ఒకరినొకరు రక్షించుకునే సమయంలోనే నీట మునిగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన ఎంతో బాధించిందని అన్నారాయన.
राजस्थान: बनास नदी में नहाने के लिए गया 11 दोस्तों का ग्रुप, डूबने से 8 की हुई मौत#Tonk #Banasriver #NewsUpdate #Tonk #banas pic.twitter.com/9kYVZAKry7
— Jan Aayam News (@AayamJan) June 10, 2025
Tags : 1