Breaking News

ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో అవకతవకలు.. ఈడీ దాడులు

Published on Fri, 04/04/2025 - 12:32

ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ (pmjay) పథకంలో అవకతవకులు జరిగాయి.  కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడీ ఏక కాలంలో దాడులకు దిగింది.  

2023లో పార్లమెంటులో కాగ్‌ నివేదికను ప్రవేశ పెట్టింది. జార్ఖండ్‌లో ఆయుష్మాన్ పథకం పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగిందనేది ఆ నివేదిక సారాశం. రోగులను చేర్చుకోకుండా, బీమా మొత్తాన్ని మోసపూరితంగా క్లయిమ్‌ చేస్తున్నారని అందులో పేర్కొంది. కాగ్‌ తన రిపోర్ట్‌లో దేశంలోని 212 ఆస్పత్రులలో పీఎంజేఏవైలో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.   

చికిత్స అందించకుండా
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ పథకం  కింద మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించి జార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీఎంజేఏవైలోని నెట్‌ వర్క్‌ ఆస్పత్రులలో ఎటువంటి వైద్య చికిత్స లేకుండా, ఏ రోగిని చేర్చకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దాడులకు దిగింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 

పీఎంజేఏవై పథకం కింద
పీఎంజేఏవై పథకం కింద కేంద్రం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. ఈ పథకంలో రూ.5లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రస్తుతం దాదాపు 12.3 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉంది. తాజాగా కేంద్రం ఈ పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వర్తించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది.

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)