Breaking News

లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం

Published on Sat, 03/09/2024 - 11:05

పాట్నా: లోక్‌సభ ఎన్నికల వేళ బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాడుల కలకలం రేగింది. మనీ లాండరింగ్‌ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ సన్నిహితుడు, ఇసుక మైనింగ్‌ కింగ్‌ సుభాష్‌యాయాదవ్‌ ఇళ్లు, ఆఫీసులపై శనివారం ఉదయం ఈడీ సోదాలు ప్రారంభించింది.

రాజధాని పాట్నా శివార్లతో పాటు దానాపూర్‌లోని పన్నెండు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో సుభాష్‌ యాదవ్‌ ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్‌లో ఈ మార్చి 3న జరిగిన మహాబంధన్‌ జనవిశ్వాస మహా ర్యాలీలో సుభాష్‌ యాదవ్‌ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం.  

కాగా, రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చర్చనీయాంశమయ్యాయి.   

ఇదీ చదవండి.. నేడు బీజేపీలోకి కాంగ్రెస్‌ దిగ్గజ నేత

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)