Breaking News

బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు..

Published on Thu, 04/13/2023 - 13:44

న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్( ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్‌ యాక్ట్ 1999 (FEMA) నిబంధనల ఉల్లంఘ‌న‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఈడీ గురువారం పేర్కొంది. 

ఫెమా నిబంధనల ప్రకారం.. కంపెనీ ఆర్థిక లావాదేవీల పత్రాలు సమర్పించాలని బీబీసీ ఇండియాను ఈడీ ఆదేశించింది. కొంతమంది బీబీసీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి స్టేట్‌మెంట్‌ల రికార్డింగ్‌ను కోరినట్లు ఈడీ సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే విదేశీ రెమిటెన్సుల (ప్రవాసుల నుంచి అందిన నిధులు) వివరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.

కాగా 2002 గుజరాత్‌ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ బీబీబీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీబీసీ డాక్యుమెంట్‌ భారత్‌లో ప్రసారం చేయకుండా బ్యాన్‌ విధించింది. దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. 

ఆ తరువాత కొద్ది రోజులకే ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే.  కొన్ని రోజులపాటు బీబీసీ ఉద్యోగుల‌ను విచారించారు. అయితే ఇవి సోదాలు కాదని.. సర్వే అని ఐటీ అధికారులు పేర్కొన్నారు. క్రమంలోనే తాజాగా ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది.
చదవండి: కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)