Breaking News

రూ.4 కోట్ల నగదు, 313 కిలోల వెండి..

Published on Sat, 12/20/2025 - 05:02

న్యూఢిల్లీ: అమెరికాకు భారతీయులను దొంగచాటుగా తరలించే డుంకి ట్రావెల్‌ ఏజెంట్‌ ఇంట్లో జరిపిన తనిఖీల్లో కళ్లు చెదిరే రీతిలో సొత్తు వెలుగు చూసింది. భారతీయుల అక్రమ రవాణాకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)బృందాలు ఢిల్లీ, పంజాబ్, హరియాణాల్లోని డజనుకుపైగా ప్రాంతాల్లో సోదాలు జరిపాయి. ఈ సందర్భంగా రూ.4.62 కోట్ల నోట్ల కట్టలతోపాటు, రూ.19.13 కోట్ల విలువైన 313 కిలోల వెండి, 6 కిలోల బంగారం కనిపించాయి. 

ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ ఏజెంట్‌ నివాసాల్లో దొరికిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో అభ్యంతరకరమైన చాటింగ్‌లు కనిపించాయని అధికారులు శుక్రవారం తెలిపారు. హరియాణాలోని పానిపట్‌లో జరిపిన తనిఖీల్లో డుంకి కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు దొరికాయన్నారు. అమెరికాకి అక్రమమార్గంలో వెళ్లాలనుకునే వారి నుంచి ఇతడు ఆస్తి పత్రాలను తన కమిషన్‌లో భాగంగా ష్యూరిటీగా ఉంచుకునేవాడని అధికారులు వివరించారు. అమెరికాలోకి దొంగచాటుగా ప్రవేశించాలనుకునే వలసదారులు గాడిద మాదిరిగా సుదీర్ఘ, కష్టమైన ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పేందుకే డాంకీ/డుంకీ అనే పదం వాడుతుంటారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)