Breaking News

మనీలాండరింగ్‌ కేసు: టీఎంసీ ఆస్తులు ఈడీ అటాచ్‌

Published on Mon, 03/11/2024 - 19:04

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అటాచ్‌ చేసింది. రూ.10.29 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ సోమవారం పేర్కొంది. ఆల్కెమిస్ట్ గ్రూప్, ఇతరులు చేసిన మనీలాండరింగ్ నేరంపై విచారణ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 10.29 కోట్లను ఈడీ టెండర్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) రూపంలో అటాచ్ చేసింది.

2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ఉపయోగించిన విమాన/హెలికాప్టర్‌ సేవలకు పలు విమానయాన కంపెనీలకు ఆల్కెమిస్ట్ గ్రూప్ దాదాపు రూ.10.29 కోట్లు చెల్లించినట్లు ఈడీ పేర్కొంది. ఇక.. అప్పటి ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్లు అయిన.. సీఎం మమతా బెనర్జీ, పార్టీ ఎమ్మెల్యే, మాజీ రైల్వే మంత్రి ముకుల్‌ రాయ్‌, నటుడు మూన్‌మూన్‌ సేన్‌, ఎంపీ నుస్రత్‌ జహాన్‌ కోసం టీఎంసీ విమాన సేవలు  ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. 

ప్రజల డబ్బులో కొంత సొమ్మును టీఎంసీ ప్రచారంలో విమానయాన కంపెనీలకు చెల్లించేందుకు సదరు ఆల్కెమిస్ట్‌ గ్రూప్‌ను ఉపయోగించుకున్నట్లు ఈడీ విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఆల్కెమిస్ట్‌ గ్రూప్.. టీఎంసీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేడీ సింగ్‌ది కావటం గమనార్హం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)