Breaking News

ఎల్లుండి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌.! ఒకే విడతలో పోలింగ్‌

Published on Fri, 10/06/2023 - 11:09

సాక్షి, ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఇవాళ భేటీ కానుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సమీక్షలు పూర్తి చేసిన ఈసీ ఓ అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాలకు ఒకే విడతలో.. ఒక రాష్ట్రానికి మాత్రం రెండు విడుతలుగా పోలింగ్‌ నిర్వహించాలని భావిస్తోందని సమాచారం. 

తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో  కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. పోలీస్, జనరల్ , ఎక్సపెండేచర్ పరిశీలకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకే ఈ భేటీ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. 

ఇక.. ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాంలలో ఒకే విడత పోలింగ్‌లో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. అలాగే.. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించాలనుకుంటోంది. ఇక డిసెంబర్‌ 10-15 తేదీల మధ్య ఓట్ల కౌంటింగ్‌ నిర్వహించేందుకు ఈసీ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. 

ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ఉపయోగించే మద్యం , డబ్బు.. నియంత్రణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తమ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయడంతో పాటుగా డబ్బు, మజిల్ పవర్ నియంత్రణకు కృషిచేయాలని పరిశీలకులకు సూచించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 8-10 తేదీల మధ్యలో.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనుంది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)