Breaking News

ఎన్నికల బాండ్ల పూర్తి డేటాను వెల్లడించిన ఈసీ

Published on Thu, 03/21/2024 - 20:37

ఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తన అధికార వెబ్‌సైట్‌ (https://www.eci.gov.in/)లో పొందుపర్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన.. న్యూమరికల్‌ నంబర్లతో కూడిన బాండ్ల పూర్తి డేటాను ఈసీ గురువారం వెబ్‌సైట్‌ అప్‌లోడ్‌ చేసింది. ఈ డేటాలో ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంత ఫండ్స్‌ ఇచ్చాయి? బాండ్ల సీరియల్‌ నంబర్లు ఇందులో ఉన్నాయి. దాతల విక్రయ వివరాలు, నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలను వేర్వేరు డాక్యుమెంట్లలో పొదుపరిచింది. 

ఇవాళ ఎస్‌బీఐ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ సమర్పించిన డేటాలో.. ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నవారి పేర్లు. బాండ్ల నంబర్లు. బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల పేర్లు. రాజకీయ పార్టీ బ్యాంక్‌ ఖాతా నంబర్‌లో చివరి నాలుగు అంకెలు. ఏ పార్టీ ఎన్ని బాండ్లను నగదు రూపంలో మార్చుకున్న  పూర్తి వివరాలు ఉన్నాయి.

ఇక..‘బ్యాంక్‌ అకౌంట్ల భద్రత (సైబర్‌ సెక్యూరిటీ) విషయంలో రాజకీయ పార్టీల పూర్తి బ్యాంక్‌ ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బహిర్గతం చేయటంలేదు. ఎన్నికల బాండ్ల కొనుగోలుదారుల కేవైసీ వివరాలను సైతం భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలను గుర్తించేందుకు ఆ వివారాలు అవసరం లేదు’ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఎస్‌బీఐ పేర్కొంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)