Breaking News

ఈట్‌ ఫాస్ట్‌, ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ : షాకింగ్‌ కంపెనీ నోటీసు

Published on Mon, 06/22/2026 - 16:50

​కార్పొరేట్‌ సంస్థల్లో  ఉద్యోగుల  కష్టాలు,  పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్‌  కల్చర్‌, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్ నోటీసుసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే..

ఉద్యోగులు లంచ్ బ్రేక్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే వారికి పెనాల్టీ విధిస్తామంటూ ఒక ఆఫీస్ బోర్డుపై పెట్టిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది పని సంస్కృతి (workplace culture) , ఉద్యోగుల హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఇంతకీ నోటీసులో ఏముంది?
ఈ నోటీసు ఏ కంపెనీకి చెందిందో స్పష్టంగా లేదు కానీ, అందులోని నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి.  దీని ప్రకారం  ఉద్యోగులకు కేటాయించిన 30 నిమిషాల లంచ్ బ్రేక్ సమయం దాటితే, ఆ అదనపు సమయానికి బదులుగా జీతం లేని అదనపు గంటలు (unpaid work hours) పని చేయాల్సి ఉంటుంది.  లంచ్ బ్రేక్ 30 నిమిషాల కంటే ఒక నిమిషం ఎక్కువైనా సరే... దానికి బదులుగా సాయంత్రం 6 గంటల తర్వాత కంపెనీ కోసం 60 నిమిషాల పాటు ఉచితంగా 'ఫోకస్ టైమ్' (Unpaid Focus Time) కేటాయించాల్సి ఉంటుంది. 

 ఒకవేళ 31 నిమిషాలు లంచ్ బ్రేక్ తీసుకుంటే, సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వాళ్లు 7:00 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి. అందుకే "త్వరగా తినండి" (Eat faster) అంటూ నోటీసు చివరలో ఘాటు హెచ్చరిక కూడా ఉండటం  గమనార్హం.

 

 

ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
నెటిజన్లు కంపెనీ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, అనాగరికమని విమర్శిస్తున్నారు. ఒక్క  నిమిషం ఆలస్యమైతే గంట సేపు ఉచితంగా పని  చేయడం,  ఓకే మరి,  ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత ఉద్యోగి ఒక్క నిమిషం ఎక్కువ పనిచేసినా ఒక గంట అదనపు జీతం  ఇస్తారా . సాయంత్రం 6:01 వరకు ఉంటే గంట జీతం ఇవ్వాలి అంటూ   కొంతమంది కౌంటరిచ్చారు.

ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

ఇలాంటి వేధింపుల వల్లే తాము రిమోట్ ఉద్యోగాల (Work from home) వైపు మొగ్గు చూపుతామని, ఆఫీస్ ఉద్యోగాలను వదులుకుంటామని మరికొందరు పేర్కొన్నారు. కొందరు మాత్రం వ్యాపార యజమానులు కూడా రాత్రింబగళ్లు కష్టపడతారని, ఉద్యోగులలో క్రమశిక్షణ కోసమే ఇలాంటివి పెడతారంటూ యజమానులు కొంతమంది స్పందించారు. 

ఇదీ చదవండి: ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

నోటీసు నిజమేనా?
ఈ నోటీసుపై కంపెనీ పేరు గానీ, ఎలాంటి లోగో గానీ లేకపోవడంతో ఇది నిజమైనదేనా లేక కేవలం సోషల్ మీడియాలో లైకులు, అటెన్షన్ కోసం క్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. "ఒకవేళ 5 నిమిషాలు త్వరగా లంచ్ ముగించుకుని వస్తే.. 5 గంటల లీవ్ ఇస్తారా?" అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)