Breaking News

మహారాష్ట్ర, అరుణాచల్‌లో భూకంపం.. భయంతో జనం పరుగులు!

Published on Thu, 03/21/2024 - 08:51

మహారాష్ట్ర, అరుణాచల్‌లో ఈరోజు (గురువారం) ఉదయం భూమి కంపించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాందేడ్‌తో పాటు పర్భానీ, హింగోలిలో భూ ప్రకంపనలు కనిపించాయి. 

మీడియాకు అందిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం ఉదయం 6 గంటల 8 నిముషాలకు భూకంప సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అఖారా బాలాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

మహారాష్ట్ర కంటే ముందు అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండుసార్లు భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 1:49 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌లో ఉంది. దీని లోతు సుమారు 10 కిలోమీటర్లు. రెండవ భూకంపం  3.40 గంటలకు సంభవించింది. రెండో భూకంప కేంద్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌లో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదైంది.ఈ రెండు భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు