అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలపై స్పందించిన జైశంకర్‌

Published on Wed, 05/15/2024 - 08:36

కోల్‌కతా:  భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్‌ మాటర్స్‌’’ బుక్‌ బంగ్లా ఎడిషన్‌ను జైశంకర్‌.. కోల్‌కతాలో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్‌ మాట్లాడారు.

‘‘విదేశీ మీడియా మన  దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ  ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి  ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి.  కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు  ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు.

..విదేశీ  మీడియా ఎందుకు భారత్‌కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా  రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరం‍గంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు.  చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు.  

..కొన్ని న్యూస్‌పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్‌ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్‌ అన్నారు.

ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుకు సంబంధించి భారత్‌  ఒ‍ప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై  మంత్రి శంకర్‌ స్పందించారు.

‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్‌ పోర్టు గురించి అమెరికా  ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్‌ అన్నారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)