Breaking News

‘భారత్‌తో సమస్య ఉంటే.. ’: ట్రంప్‌కు జైశంకర్‌ స్పష్టం

Published on Sat, 08/23/2025 - 13:26

న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న ఏకైక కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అదనపు సుంకాలు విధించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌  కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన మరోమారు స్పష్టం చేశారు. భారత్‌తో ఏదైనా సమస్య ఉన్న పక్షంలో ఈ దేశపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు జైశంకర్‌ స్పష్టం చేశారు.

‘ఎకనమిక్‌ టైమ్స్‌’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ లీడర్స్‌ ఫోరం సదస్సులో ఎన్‌ జైశంకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై వెల్లువెత్తుతున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు.  భారత్‌-అమెరికా మధ్యవాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే మన దేశానికంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. మన రైతులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజాలను కాపాడేందుకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
 

ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వ్యాపార అజెండాతో వ్యవహరిస్తున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు పలుకుతూ, కొందరు తమపై నిందలు వేయడం  హాస్యాస్పదమని జైశంకర్‌ పేర్కొన్నారు. నిజంగా మీకు(అమెరికాకు) భారత్‌తో సమస్య ఉంటే, ఈ దేశపు  చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలంటూ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు. అవి మీకు నచ్చకపోతే కొనకండంటూ జైశంకర్‌ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ అదనపు సుంకాల గురించి పూర్తిగా ప్రకటించడానికి ముందే, తాము రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేమని జైశంకర్‌ అన్నారు. 

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)