Rajasthan: కారుపై డంపర్ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Published on Thu, 03/20/2025 - 09:02

బికనీర్‌: రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓవర్‌ బ్రిడ్జిపై వెళుతున్న కారుపై డంపర్‌ బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్నవారంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బుధవారం అర్థరాత్రి దాటాక దేశ్‌నోక్‌ ఓవర్‌బ్రిడ్జిపై చోటుచేసుకుంది. అత్యంత వేగంగా వెళుతున్న ఒక డంపర్‌ ఉన్నట్టుండి నియంత్రణ(Control) కోల్పోయి, పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. భారీగా ఉన్న డంపర్‌ పడటంతో కారు నుజ్జునుజ్జయిపోయింది. ఈ సమయంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం దరిమిలా ఓవర్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఓవర్‌ బ్రిడ్జిపై కారు, డంపర్‌ ఒక దిశలో వెళుతున్నాయి. డంపర్‌ ఒక్కసారిగా కారుపై తిరగబడగానే కారులో ఉన్నవారికి తప్పించుకునే మార్గం లేకపోయింది. ప్రమాద ఘటన గురించి తెలియగానే దేశ్‌నాక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో జేసీబీని వినియోగించి డంపర్‌ను రోడ్డుకు ఒక పక్కగా తీసుకువచ్చారు. మృతులలో ఒక మహిళతో పాటు ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)