Breaking News

ఒడిశాలో రాష్ట్రపతి ముర్ము స్పెషల్ ట్రైన్ జర్నీ!

Published on Wed, 08/05/2026 - 17:49

భవనేశ్వర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సొంత రాష్ట్రమైన ఒడిశా పర్యటనలో ప్రత్యేక రైలులో ప్రయాణించారు. వర్షాకాలంతో పాటు ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భువనేశ్వర్ నుండి బరంపురం వరకు సుమారు 170 కి.మీ మేర ఆమె ఈ రైలు ప్రయాణం సాగించారు. ఈ సందర్బంగా  రాష్ట్రపతి రైలు ప్రయాణం కోసం అరుదైన భద్రత కల్పించారు.  

ఈ ప్రత్యేక రైలు  మెుత్తం 10 బోగీలను కలిగి ఒక అల్ట్రా-లగ్జరీ సెలూన్ కోచ్‌ను కలిగి ఉంది. ఇందులో ఎయిర్ కండిషన్డ్ బెడ్‌రూమ్‌లు, లివింగ్-కమ్-డైనింగ్ రూమ్, అత్యాధునిక వంటగది వంటి సకల సౌకర్యాలు దీని సొంతం.  రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఈ రైలు వెళ్లేటప్పుడు దాని ముందు ఒక ప్రత్యేక రైలు, వెనుక మరో రైలు భద్రతగా నడిచాయి. ఒక స్టాండ్‌బై రైలూ సిద్ధంగా ఉంచారు. ప్రయాణ సమయంలో, మొత్తం రైల్వే ట్రాక్‌ను ఖాళీ చేయించి ఆ లైన్‌పై ఇతర రైళ్లను అనుమతించలేదు.

ఎందుకు రైలు మార్గం

రాష్ట్రపతి పర్యటన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, హెలికాప్టర్ లేదా విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యామ్నాయంగా రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. రోడ్డు లేదా వైమానిక మార్గాలతో పోలిస్తే, రైలు ప్రయాణంలో ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేయడం సులభం. 

భారతదేశంలో మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ కాలం నుండి రాష్ట్రపతులు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగానే  ద్రౌపదీ ముర్ము  అప్పుడప్పుడు రైలు ప్రయాణాలను ఇష్టపడుతుంటారు.
 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)