Breaking News

‘లీకేజీ’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం 

Published on Sun, 08/02/2026 - 05:31

న్యూఢిల్లీ: ప్రశ్నపత్రాల లీకేజీకి, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే దోషులకు కఠిన శిక్షలు విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026’పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2024 నాటి చట్టంలో సవరణ చేస్తూ ఈ బిల్లును రూపొందించింది. 

శిక్షలు, జరిమానాలను భారీగా పెంచింది. ఇటీవల పార్లమెంట్‌ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు కొన్ని సవరణలు చేయాలని సూచించగా, ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్రపతి ఆమోదం తెలియజేయడంలో బిల్లు ఇక చట్టరూపం దాల్చినట్లే. ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రశ్నపత్రం లీకేజీ కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 

పరీక్షల్లో పేపర్‌ లీకేజీ లేదా అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం ఐదేళ్లు మరియు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాలను లీక్‌ చేయడం, ఓఎంఆర్‌ షీట్లను తారుమారు చేయడం, నకిలీ వెబ్‌సైట్లు సృష్టించడం, నకిలీ అడ్మిట్‌ కార్డులను జారీ చేయడం వంటి 15 చట్టవిరుద్ధమైన చర్యలను ఈ చట్టంలో చేర్చారు.

 అలాగే కేసుల విచారణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టులు చార్జ్‌షీట్‌ దాఖలైన మూడు నెలల లోపే విచారణను పూర్తి చేస్తాయి. ఈ ఏడాది నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఆ బిల్లు త్వరగా పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   
 

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)