Breaking News

డ్రోన్ ఫుటేజ్.. ఉగ్రవాదుల్ని ఎంత క్లియర్‌గా రికార్డు చేసిందో..!

Published on Thu, 05/15/2025 - 16:26

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మరో ఉగ్రదాడికి విఫలయత్నం జరిగింది. రెండు రోజుల క్రితం పలువురు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో మరో కిరాతకానికి పాల్పడే ప్రయత్నంలో దాన్ని మన నిఘా వర్గాలు పసిగట్టి వారిని హతమార్చాయి.  మంగళవారం జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు.. మన భద్రతా దళాల చేతిలో హతమయ్యారు.  వారిని ల‌ష్క‌రే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్ లోని అవంతిపోరాలో ఉగ్రవాదులు తమ పన్నాగానికి సిద్ధమైన సమయంలో దాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టి వారిపై కాల్పులు జరిపి హతమార్చాయి. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదిగా భావించినా దానిపై క్లారిటీ రాలేదు.  ఇదిలా ఉంచితే, ఈ ఘటనకు సంబంధించి  ఇక్కడ డ్రోన్ ఫుటేజ్ ఒకటి బయటకొచ్చింది.

ఒక కాంక్రీట్ పిల్లర్ కింద ఉగ్రవాదులు తమ రైఫిల్స్ ను సరిచేసుకుంటున్న సమయంలో డ్రోన్ దానిని రికార్డు చేసింది. మరొక వీడియోలో  విరిగిన షెడ్ లో గుమిగూడి ఉన్న మరి కొందరు కనిపించారు.  దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక గడిచిన రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులు.. భారత బలగాల చేతిలో హతమయ్యారు.

అయితే వీరంతా పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ తర్వాత తప్పించుకునే క్రమంలో  ఓ ఇంట్లో ఆశ్రయం పొంది ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇలా 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు బయటకొచ్చి భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు.  

జమ్మూలో మళ్లీ మొదలైన ఉగ్రవేట ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)