Breaking News

ఏటా 6,516 వరకట్న హత్యలు.. భయపెడుతున్న ఎన్‌సీఆర్బీ డేటా

Published on Wed, 08/27/2025 - 09:41

లక్నో: యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకున్న వరకట్న వేధింపుల ఘటనలో ఒక మహిళ బలయ్యింది. ఆమెను భర్త, అత్తింటివారు సజీవదహనం చేసిన  ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది దేశంలో వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న హింసాయుత ఘటనల తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

అత్యాచారాల కంటే అధికం
దేశంలో వరకట్న మరణాలనేవి అత్యాచారాల కంటే అధికంగా ఉన్నాయని హోం మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్బీ) తెలియజేసింది. బ్యూరో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 6,516 వరకట్న మరణాలు  చోటుచేసుకున్నాయి. అత్యాచారం, గ్యాంగ్‌రేప్‌ తరువాత హత్యకు గురైన మహిళల మరణాల కంటే ఈ మరణాలు 25 రెట్లు ఎక్కువ అని వెల్లడయ్యింది. 
   
ప్రతి మూడో మహిళ..
2022లో 13,641 మహిళలు వరకట్న వేధింపులకు గురయ్యారు.  ఈ ఉదంతాలు పోలీస్‌ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ సంఖ్యను అనుసరించి చూస్తే, వరకట్న వేధింపులకు గురైన ప్రతి మూడో మహిళ మరణిస్తున్నదని తెలుస్తోంది. బాధితులు చివరివరకు న్యాయపరమైన సహాయాన్ని కోరడంలో వెనుకడుగు వేస్తుండటమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.
   
న్యాయం దొరకే అవకాశాలు బహు స్వల్పం
2022 చివరి నాటికి 60,577 వరకట్న కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా, అందులో 54,416 కేసులు  ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి.  ఆ ఏడాది 3,689 కేసులకు సంబంధించిన విచారణ పూర్తయినా, కేవలం 33శాతం తీర్పులలో నిందితులకు శిక్ష పడింది. కోర్టులకు పంపిన 6,161 నూతన కేసుల్లో కేవలం 99 కేసుల్లో మాత్రమే శిక్షలు అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే బాధిత కుటుంబాలకు ఏడాదిలోపు న్యాయం దొరకే అవకాశాలు రెండు శాతం కంటే చాలా తక్కువేని తేలింది.
   
వరుడి కుటుంబంతో పోలిస్తే..
భారతదేశంలో వరకట్నం ఇప్పటికీ ఒక  ఆచారంగా కొనసాగుతోంది. పలు అధ్యయనాలు ఈ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని తెలియజేస్తున్నాయి. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (2004-05)లో వెల్లడైన వివరాల ప్రకారం పెళ్లిళ్లలో వరుడి కుటుంబంతో పోలిస్తే వధువు కుటుంబం 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నది.    24 శాతం కుటుంబాలు టీవీలు, ఫ్రిజ్‌లు, కార్లు, బైక్‌లు తదితర వస్తువులను వరునికి కట్నంగా ఇచ్చాయి.

మహిళల్లో 29 శాతం మంది..
2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) తెలిపిన వివరాల ప్రకారం     18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 29 శాతం మంది భర్తలు లేదా భాగస్వాముల నుంచి శారీరక లేదా లైంగిక హింస అనుభవిస్తున్నారు. వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు  వివిధ స్వచ్ఛంద సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)