Breaking News

రన్నింగ్ ట్రాక్‌ కాదది.. రూ.449 కోట్ల ఫ్లైఓవర్!

Published on Mon, 12/15/2025 - 13:38

బెంగళూరు: బెంగళూరు నగరంలో రూ. 449 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒక డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ కాస్తా రన్నింగ్‌ ట్రాక్‌గా మారిపోయింది. నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్, ఎలక్ట్రానిక్స్ సిటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూ. 449 కోట్ల భారీ వ్యయంతో  ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తు​న్నారు. దాదాపు ఐదు కి.మీ పొడవున్న ఈ ఫ్లైఓవర్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌గా పేరొందింది.

ఈ ఫ్లైఓవర్‌ మొదటి దశ (రాగిగుడ్డ నుండి హెచ్‌ఆర్‌ఎస్‌ లేఅవుట్‌కు) పనులు 2024 జూలై  నాటికి పూర్తయ్యాయి. దీంతో సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద రద్దీ కొంత మేరకు తగ్గింది. అయితే రెండవ దశ (హెచ్‌ఎస్‌ఆర్‌ నుండి రాగిగుడ్డ వైపు) నిర్మాణం పూర్తైనట్లు కనిపిస్తున్నా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.ఈ జాప్యానికి భారీ ట్రాఫిక్ రద్దీ, పని గంటలపై విధించిన ఆంక్షలే కారణమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్‌)అధికారులు చెబుతున్నారు. కాగా ప్రారంభానికి నోచుకోని ఈ ఫ్లైఓవర్‌ను స్థానికులు తమ మార్నింగ్‌ జాగింగ్, వాకింగ్‌లకు ట్రాక్‌గా ఉపయోగిస్తున్నారు.

స్థానికుడు కిరణ్ కుమార్  మాట్లాడుతూ ‘ఈ ఫ్లైఓవర్ ప్రారంభానికి దాదాపు సిద్ధమైంది. అయితే యాక్సెస్ ర్యాంప్ ఇంకా సిద్ధం కాలేదు. అందుకే మేము కట్టే రోడ్డు టాక్స్‌ను సద్వినియోగం చేసుకునేందుకు దీనిపై రన్నింగ్‌ చేస్తున్నామన్నారు. అధికారికంగా వాహన రాకపోకలకు తెరుచుకోని ఈ ఫ్లైఓవర్ నగరంలో తాత్కాలిక వాహన రహిత రన్నింగ్ ట్రాక్‌గా మారిపోయింది. కాగా బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణంలోని మిగిలిన 10శాతం పనులు త్వరలోనే పూర్తిచేసి, 2026 జనవరి చివరి నాటికి అందుబాటులోకి తెస్తామంటున్నారు.

ఇది కూడా చదవండి: కొద్ది రోజుల్లో ప్రళయం.. ఘనా ప్రవక్త జోస్యం!

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)