Breaking News

డాగ్‌ బాబు సన్నాఫ్‌ కుత్తా బాబు! 

Published on Tue, 07/29/2025 - 05:21

పట్నా: బిహార్‌లో రెవెన్యూ అధికారులు ఓ శునకానికి రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. డాగ్‌ బాబు పేరిట ఈ నివాస ధృవీకరణ పత్రం జారీ అయింది. ఇందులో అభ్యర్థి పేరు డాగ్‌బాబు అని, అతని తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి అని రాసి ఉంది. వీళ్ల ఇంటి చిరునామా కాలమ్‌లో ‘మొహల్లా కౌలిచక్, వార్డు నంబర్‌–15, నగర పరిషత్, మసౌరీ పట్టణం’’అని రాసి ఉంది. 

గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతి వీధి శునకం ఫొటోతో ఈ ధృవపత్రం జారీచేశారు. ఈ రెసిడెన్స్‌ సర్టిఫికేట్‌పై అక్కడి రెవెన్యూ అధికారి మురారీ చౌహాన్‌ డిజటల్‌ సంతకం ఉంది. ఇది 2025 జూలై 24న ఈ సర్టిఫికేట్‌ను జారీచేశారు. సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడంతో ఈ అంశం ఇప్పుడు బిహార్‌లో చర్చనీయాంశమైంది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ పత్రాలకు ఈ సర్టిఫికేట్‌ జారీ కోసం దురి్వనియోగం చేసినట్లు తెలుస్తోంది.

 బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) నేపథ్యంలో శునకానికీ రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీకావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్‌ఐఆర్‌ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో ఇలాంటి వింతలు ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ సోషల్‌ మీడియా వేదికగా విమర్శించారు. ‘మీరే చూడండి. జూలై 24వ తేదీన ఒక శునకానికి బిహార్‌లో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. 

రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్న ఓటర్లకు గతంలో జారీ అయిన ఆధార్, రేషన్‌ కార్డులు నకిలీవని అధికారులు ఓవైపు చె బుతూనే మరోవైపు ఇలా శునకాలకు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు’’అని విమర్శకులు సంబంధిత శునకం సర్టిఫికెట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.

 సర్టిఫికెట్‌ జారీపై అంతటి విమర్శలు రావడంతో పట్నా జిల్లా మేజి్రస్టేట్‌ వెంటనే స్పందించారు. ‘మసౌరీ జోన్‌లో డాగ్‌ బాబు పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నాం. దోషులైన ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’అని జిల్లా మేజి్రస్టేట్‌ తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌ చేశారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)