Breaking News

సమ్మెలో డాక్టర్లు.. దేశవ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు

Published on Sat, 08/17/2024 - 07:56

కలకత్తా: పశ్చిమబెంగాల్‌ రాజధాని కలకత్తాలోని ఆర్జీకార్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె ప్రారంభమైంది. యువ డాక్టర్‌ హత్యకు నిరసనగా ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ప్రకటించింది. 

ఇందులో భాగంగా శనివారం(ఆగస్టు17) ఉదయం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. దేశంలోని  అన్ని ఆస్పత్రుల్లో అవుట్‌పేషెంట్‌(ఓపీ) సేవలు ఆగిపోయాయి. మళ్లీ ఆదివారం ఉదయం 6 గంటల తర్వాతే డాక్టర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

విశాఖపట్నంలో నిలిచిపోయిన వైద్య సేవలు

  • జూనియర్‌ డాక్టర్ల సమ్మెకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
  • అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్
  • నిరసనలో పాల్గొననున్న ప్రభుత్వ ప్రైవేట్ వైద్యులు
  • విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం.. మద్దతు పలకనున్న అన్ని ప్రజా సంఘాలు..

అనంతపురంలో వైద్యుల సమ్మె..

కలకత్తాలో జరిగిన యువ వైద్యురాలి అత్యాచారం, హత్య నిరసిస్తూ వైద్య సేవలు నిలిపివేసిన అనంతపురంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల వైద్యులు. జీజీహెచ్‌లో అవుట్‌పేషెంట్‌ సేవల నిలిపివేత. 

విజయవాడలో ఆగిన ఓపీ సేవలు

  • కోల్ కతాలో జూనియర్ డాక్టర్ దారుణహత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల ఆందోళన
  • విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో  విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు
  • నేడు ఓపీ సేవలు పూర్తిగా నిలుపుదల
  • అత్యవసర సేవలకు మినహాయింపు
  • జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు పలికిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్
  • కేంద్రం వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని డిమాండ్

తిరుపతిలో డాక్టర్ల నిరసన  

  • రుయా హాస్పిటల్ వద్ద ఏపి జూడాలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్అసోషియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన
  • బహిరంగ ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్న జూడాలు
  • తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజి  మెడికల్ విద్యార్థులు, జూడాలు ఆద్వర్యంలో నిరసన

సీబీఐ దర్యాప్తు ముమ్మరం

ఆర్‌జీ కార్‌ ఆసుపత్రిలో యువ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమ కుమార్తెపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో అదే ఆసుపత్రిలో పని చేస్తున్న కొందరు జూనియర్‌ వైద్యులు, ఇతర సీనియర్‌ వైద్యుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామంటూ తల్లిదండ్రులు చెప్పినట్లు సీబీఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

 కొన్ని పేర్లను సైతం బయటపెట్టారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో బాధితురాలితోపాటు కలిసి పనిచేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు తెలిపినట్లు స్పష్టంచేశారు. 30 మందిని పిలిపించి, విచారించాలని నిర్ణయించామని అధికారులు వివరించారు. ఆసుపత్రి వైద్యులను, పోలీసు అధికారులను ప్రశ్నించబోతున్నామని చెప్పారు. బాధితురాలు హత్యకు గురైన రోజు ఆసుపత్రిలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి సమన్లు జారీ చేశామని తెలిపారు. 

ఇదిలా ఉండగా, ట్రైనీ డాక్టర్‌ హత్యకు గురైన గదిలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ఏర్పాటైన విచారణ కమిటీ ఆరోపించింది. హత్య సంగతి బయటపడగానే ఆ గదిని పరిరక్షించాల్సి ఉండగా, కొందరు లోపలికి వెళ్లి శుభ్రం చేశారని పేర్కొంది. కోల్‌కతాలోని డాక్టర్‌ హత్యాకాండను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు శుక్రవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కలి్పంచాలని డిమాండ్‌ చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)