Breaking News

తల్లికి వైద్యం సరిగా చేయలేదని కత్తితో డాక్టర్‌పై దాడి

Published on Wed, 11/13/2024 - 13:13

తల్లికి వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు చెన్నైలోని గిండీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ యువకుడు ఈ ఏడాది మే నుంచి నవంబర్‌ వరకు తన తల్లి ప్రేమకు క్యాన్సర్‌ వైద్యం చేయించాడు. ఆమె పరిస్థితి మెరుగు పడకపోవడంతో వైద్యుడు బాలాజీ జగన్నాథన్‌పై కక్ష పెంచుకుని దాడి చేశాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఓ యువకుడు ఉద్యోగి వేషధారణలో వచ్చి.. ప్రభుత్వ వైద్యుడిని ఏడుసార్లు కత్తితో పొడిచాడు. దీంతో ఆయన ఛాతీ పైభాగానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం డాక్టర్‌ ఐసీయూలో ఉన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కత్తితో పొడిచి పారిపోతుండగా నిందితుడిని  వైద్యసిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కలైంజర్ సెంటెనరీ హాస్పిటల్‌లోని ఓపీడీ లేదా ఔట్ పేషెంట్ విభాగంలో.. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి డాక్టర్ తప్పుగా మందులు రాశారని కక్ష పెంచుకొని ఆ యువకుడు ఈ డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై.. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ స్పందించారు. యువకుడు చిన్న కత్తితో  దాడి చేశాడు. ఈ ఘటనలో భద్రతా లోపం ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. డాక్టర్‌కు వైద్య సహాయం హామీ ఇచ్చారు. అలాగే ఇటువంటి దాడి మళ్లీ జరగదని హామీ ఇచ్చారు.

“సమయంతో సంబంధం లేకుండా రోగులకు చికిత్స అందించడంలో మన ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి ఎనలేనిది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)