Breaking News

సీఎం విజయ్‌పై 'హార్స్ ట్రేడింగ్' ఆరోపణలు!

Published on Wed, 07/01/2026 - 16:29

సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌కు షాక్‌ తగిలింది. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేసేలా విజయ్‌, టీవీకే సెక్రటరీ వైకో ప్రలోభ పెడుతున్నారని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ గవర్నర్‌కు లేఖ రాశారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బుల ఆశ చూపుతూ హర్స్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని లేఖలో ఆరోపించారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికలు ముగిసి దాదాపు రెండు నెలలు గడిచిన తమిళనాడు రాజకీయాలు ఇంకా చల్లబడడం లేదు. తాజాగా డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌.ఎస్‌ భారతి సీఎం విజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు.

ఆ లేఖలో... డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఎం, రాజేంద్రన్, సెంథిల్‌ సెల్వన్‌ లను తమ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్‌ ఒత్తిడి చేస్తున్నారు. దీనికోసం హర్స్‌ ట్రేడింగ్‌ ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడుతున్నారు. కనుక గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకొని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలి. వీరిద్దరు డీఎంకే గుర్తుపై గెలిచిన వ్యక్తులు కనుక తప్పనిసరిగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

అదే విధంగా డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి తమిళనాడు గవర్నర్‌తో పాటు అవినీతి నిరోధక శాఖ (DVAC)కు కూడా అధికారికంగా  లేఖ రాశారు.  అయితే ఇటీవల సీఎం విజయ్‌ తన మిత్రపక్షాలతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి VCK,IUML,MDMK పార్టీలను ఆహ్వానించారు. త్వరలోనే విజయ్‌ సెక్యూలర్‌ ఫ్రంట్‌ అనే కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా కొద్దిరోజుల క్రితం డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడులో ఏ క్షణాన్నైన ఎన్నికలు రావచ్చు అన్నారు. దీంతో విజయ్‌ తన ప్రత్యర్థులకు చెక్‌ పెట్టి తన బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)