Breaking News

సెకండాఫ్‌లో సీఎం పోస్టు.. ఆ ఆశ ఇంకా సజీవంగానే!

Published on Tue, 09/09/2025 - 14:02

డీకే శివకుమార్‌ (DK Shivakumar)  వరుస ప్రకటనలతో కర్ణాటక రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతూనే వస్తోంది. గతకొంతకాలంగా ‘సీఎం మార్పు’ అంశంపై రాజకీయం ఎంతకీ తెగట్లేదు. అలాగే రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.  ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య చెబుతున్నా.. తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్‌ అంటున్నా అక్కడి రాజకీయాల్లో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. 

తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్‌ దీనిపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారాయన. ప్రపంచంలో ఏ మనిషైనా ఆశతోనే బతుకుతారని... ఆ ఆశే లేకుంటే జీవితమే లేదు. మీరడిగిన ప్రశ్నకు నేను కాదు.. కేవలం కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అన్నారాయన. ఇండియా టుడే కంక్లేవ్‌ సౌత్‌ 2025లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 

సీఎం పదవి నిర్ణయం పార్టీ హైకమాండ్‌దేనని డీకే మరోసారి కుండబద్ధలు కొట్టారు. నేను.. నా నాయకత్వం, నేను.. నా పార్టీ, నేను .. సిద్ధరామయ్య. ఎవరైనా.. ఏ విషయంలో అయినా మా పార్టీ హైకమాండ్‌దే సంపూర్ణ అధికారం. వారు చెప్పినదానికే మేం కట్టుబడి ఉంటాం. మేము కర్ణాటక ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని హామీ ఇచ్చాం. అదే మా ముఖ్య లక్ష్యం. అందుకోసం అందరం కలసి పని చేస్తాం అని అన్నారాయన.

కాంగ్రెస్‌ ప్రభుత్వ బలం..  ఏ శివకుమార్‌ మీదో, సిద్ధారమయ్య మీదో, మరెవరి మీదో ఆధారపడి ఉండదు. అది ఐక్యత మీద ఆధారపడి ఉంటుంది. అది నిరంతర సమిష్టి విజయం. ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆ ఐక్యతే మాకు బలం అని అన్నారాయన. 

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 మే 20న అధికారంలోకి వచ్చింది. అంటే, ఇప్పటివరకు సరిగ్గా 1 సంవత్సరం 3 నెలలు (2025 సెప్టెంబర్ 9 నాటికి) పూర్తయ్యాయి. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు.

ఈ ప్రచారాన్ని సిద్ధరామయ్య మొదటి నుంచి తోసిపుచ్చుతున్నారు. అయితే తాను ముఖ్యమంత్రిని (Karnataka CM) కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదంటున్న డీకే శివకుమార్‌.. అందుకు పార్టీ పెద్దల ఆశీర్వాదం కూడా ఉండాలంటున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)