Breaking News

Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’

Published on Mon, 02/20/2023 - 20:01

క్రైమ్‌: అతనొక దివ్యాంగుడు. వైకల్యాన్ని లెక్కచేయకుండా.. బాగా చదువుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకూడదని ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుని.. జీవితంలో ముందుకు వెళ్తున్నాడు. అయితే వయసు మూడు పదులు దాటడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే అతని పాలిట మరణ శాసనం అయ్యింది. 

వివాహం చేసుకోవాలని ఉందని చెప్పినందుకు ఓ దివ్యాంగుడిని.. సవతి తల్లి, అతని తండ్రి సాయంతోనే కడతేర్చింది. ఒడిషా నయాగఢ్‌ జిల్లా పథరాపుంజ గ్రామం దసపల్లా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోరం చోటు చేసుకుంది.  బాధితుడు విజయ్‌ ప్రధాన్‌(35).. తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం ఉంది.

తన పిల్లలను బాగా చూసుకుంటూ.. విజయ్‌ను రాచిరంపాన పెడుతూ వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. అయినా విజయ్‌ మాత్రం పట్టించుకోకుండా బాగా చదువుకుని.. స్థానికంగా ఓ చిన్నకంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో  వివాహం చేసుకోమని అతని మేనత్త, మేనమామలు సూచించారు. వాళ్ల కోరిక ప్రకారం స్థిరపడాలనుకున్నాడు. అయితే.. పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం విజయ్‌ లాక్కెళ్లిపోతాడేమోనని ఆ సవతి తల్లి భయపడింది. అతని వివాహానికి ససేమీరా చెప్పింది.

అయినా విజయ్‌ మేనత్త సంబంధాలు చూడసాగింది. ఇది ఆ సవతి తల్లికి కోపం తెప్పించింది. శనివారం ఈ విషయంపై ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఈ క్రమంలో సవతి తల్లి, విజయ్‌ తండ్రి, వాళ్ల పిల్లల సాయంతో.. విజయ్‌ను కర్రలతో కొట్టి చంపారు. ఈ మేరకు విజయ్‌ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)