Breaking News

వ్యక్తిత్వానికి ఆభరణం నిజాయతీ

Published on Sun, 11/30/2025 - 06:14

సోనీపట్‌: మనుషులు ఎల్లవేళలా నిజాయతీ కి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సూచించారు. నిజాయతీ అనేది మనిషి వ్యక్తిత్వానికి విలువైన ఆభరణం లాంటిదని చెప్పారు. అంతేకాకుండా న్యాయం, ఖ్యాతిని కాపాడుతుందని అన్నారు. న్యాయ శాస్త్రం అభ్యసిస్తున్న విద్యార్థులు నిజాయతీని తమ జీవితాల్లో అంతర్భాగంగా మార్చుకో వాలని పిలుపునిచ్చారు.

 హరియాణా రాష్ట్రం సోనీపట్‌లోని ఓ.పి.జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో న్యాయ వ్యవస్థ స్వతంత్రపై శనివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో జస్టిస్‌ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ శాస్త్రంపై చర్చల కోసం న్యాయాభ్యాస మండపాన్ని ప్రారంభించారు. అలాగే ఇంటర్నేషనల్‌ మూటింగ్‌ అకాడమీ ఫర్‌ అడ్వొకసీ, నెగోషియేషన్, డిస్ప్యూట్‌ అడ్జుడికేషన్, అర్బిట్రేసన్, రిసొల్యూ సన్‌ (ఇమాన్‌దార్‌)కు శ్రీకారం చుట్టారు. 

కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్, ఎంపీ, యూనివర్సిటీ చా న్సలర్‌ నవీన్‌ జిందాల్, పలువురు న్యాయని పుణులు, న్యాయవాదు లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రసంగిస్తూ.. నిజాయతీ ప్రాముఖ్యతను వివరించారు. ఎవరూ చూడనప్పుడు మనం ఏం చేస్తామో అదే నిజాయతీ, చుట్టూ ఉన్న అందరూ చూస్తుండగా చేసేది సాహసం అని పేర్కొన్నారు. నిజాయతీ అనే ఒక్క పదానికి నైతికంగా ఎంతో విలువ ఉందన్నారు.  

సత్యం, జ్ఞానం పరస్పరం పోటీ పడాలి  
నేడు టెక్నాలజీ యుగంలో డీఫ్‌ ఫేక్‌ ఫోటోలు, వీడియోల బెడద పెరిగిపోయిందని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆందోళన వ్యక్తంచేశారు. తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. ప్రతిరోజూ దేశంలో ఏదో ఒకచోట డిజిటల్‌ అరెస్టులు చోటు చేసుకుంటున్నాయని చె ప్పారు. ఇలాంటి పరి స్థితుల్లో సత్యం, జ్ఞానం పరస్పరం పోటీ పడా లని ఉద్ఘాటించారు. నీతి నిజాయతీ అనేవి కేవలం మాటల్లో చెప్పుకొనే ఆదర్శాలు కాదని, మనిషి మనగడకు అవి ముఖ్య సాధనాలు అని స్పష్టంచేశారు. 

ఎట్టిపరిస్థితుల్లోనూ నిజాయతీని వదు లుకోవద్దని న్యాయ విద్యార్థులకు సూచించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాలని అన్నారు. రాజ్యాంగ పరిషత్‌లోని 15 మంది మహిళా సభ్యులలో ఒకరైన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ చెప్పిన మాటలను జస్టిస్‌ సూర్యకాంత్‌ గుర్తుచేశారు. స్వతంత్రంగా ఉన్నట్లు న్యాయ వ్యవస్థ భావించాలని స్పష్టంచేశారు. న్యాయ వ్యవస్థ ఇతరుల ఒత్తిళ్లు, ప్రలోభాకలు లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని తేల్చిచెప్పారు. కాలం మారుతున్నప్పటికీ న్యాయ వ్వవస్థ ప్రజల విశ్వాసం కోల్పోవద్దని పేర్కొన్నారు.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు