Breaking News

చెత్తకుప్పలో వీవీప్యాట్‌ స్లిప్పులు

Published on Sun, 11/09/2025 - 02:47

సమస్తీపూర్‌: బిహార్‌లోని సమస్తీపూర్‌లో పెద్ద సంఖ్యలో వీవీప్యాట్‌(ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌)స్లిప్పులను రోడ్డు పక్కన విసిరేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి తీవ్ర కలకలం రేపింది. శనివారం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరలవుతోంది. పార్టీ గుర్తులు ముద్రించి ఉన్న ఆ స్లిప్పులను జనం ఏరుతున్నట్లుగా అందులో కనిపిస్తోంది. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ సీరియస్‌గా స్పందించింది. అవి ఈవీఎంల నుంచి పడేసిన స్లిప్పులేనని పేర్కొంది. అయితే, అవి పోలింగ్‌ ముందు రోజైన బుధవారం నిర్వహించిన మాక్‌ పోల్‌కు సంబంధించిన స్లిప్పులు మాత్రమేనని, వాస్తవ ఓటింగ్‌నకు సంబంధించినవి కావని జిల్లా యంత్రాంగం తెలిపింది.

మాక్‌ పోల్‌ తర్వాత స్లిప్పులను కత్తిరించి బయటపడేశామని, అందులో కట్‌ కాని కొన్ని స్లిప్పులు స్థానికులు ఏరుకున్నారని డీఎం రోషన్‌ కుష్వాహా వివరించారు. తాము స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి వాటిని పరిశీలించామన్నారు. వాటిపై ఉన్న ఈవీఎంల నంబర్ల ఆధారంగా బాధ్యులైన పోలింగ్‌ సిబ్బంది గుర్తించవచ్చని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. సంబంధిత నియోజకవర్గంలోని అభ్యర్థులకు ఈ విషయం తెలిపామన్నారు.

ఇందుకు బాధ్యుడైన అసిస్టెంట్‌ రిటరి్నంగ్‌ అధికారి(ఏఆర్‌వో)పై కఠినచర్యలు తీసుకోవాలని ఈసీ ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఆదేశించారు. సంబంధిత ఏఆర్‌వోను సస్పెండ్‌ చేయడంతోపాటు కేసు నమోదు చేస్తామన్నారు. ఘటనపై విచారణ చేపట్టి, సవివర నివేదిక అందజేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ఓటింగ్‌ ప్రక్రియపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును పరిశీలించే ఉద్దేశంతో మాక్‌ పోల్‌ ప్రక్రియను చేపడతారు. అనంతరం, అందులోని ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పూర్తిగా తొలగిస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)