డిజిటల్‌ అరెస్ట్‌.. పౌరులపాలిట పెనుముప్పు 

Published on Tue, 10/28/2025 - 06:43

న్యూఢిల్లీ: వేగంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికత పోలీసింగ్‌ రూపురేఖల్నే మార్చివేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ప్రస్తుతం డిజిటల్‌ అరెస్ట్‌ నేరాలు పౌరులకు అత్యంత ప్రమాదకరమైనవిగా తయారయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల ప్రజలు ఇలాంటి వాటి బారినపడితే పోలీసులను తమకు సాయపడే ఏకైక మార్గంగా భావిస్తారన్నారు. 

సోమవారం రాష్ట్రపతి భవన్‌తో తనను కలుసుకున్న ఐపీఎస్‌ ప్రొబేషనరీ అధికారుల బృందంతో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశ ఆర్థిక వృద్ధి నిలకడగా కొనసాగించడానికి, వేగవంతం చేయడానికి మరింత పెద్ద ఎత్తున ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ పెట్టుబడులు అవసరమని రాష్ట్రపతి అన్నారు. ఏ రాష్ట్రంలోగానీ, ప్రాంతంలోకి గానీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యవసరమైంది మెరుగైన శాంతి భద్రతలేనని తెలిపారు. ఈ విషయంలో ప్రభావవంతమైన పోలీసింగ్‌ వ్యవస్థ అవసరం ఎంతో ఉంటుందని ముర్ము చెప్పారు. 

వికసిత్‌ భారత్‌ కల సాకారానికి భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే ఐపీఎస్‌ ప్రొబేషనరీలు కీలకంగా మారనున్నారని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత కారణంగా పోలీసింగ్‌ వ్యవస్థ రూపురేఖలే మారిపోయాన్న రాష్ట్రపతి ముర్ము..పదేళ్ల క్రితం డిజిటల్‌ అరెస్ట్‌ అనే మాటను అర్థం చేసుకోవడం అసాధ్యంగా ఉండేదని, ఇప్పుడిది పౌరులపాలిట భయంకరమైన బెడదగా మారిందని చెప్పారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు భద్రతాధికారులు కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతను అలవర్చుకోవాల్సి ఉందన్నారు. అదే సమయంలో పోలీసులంటే భయపెట్టే వ్యవస్థగా కాకుండా సేవాభావం, సున్నితత్వం, సానుభూతితో పనిచేయాలని, ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల భయాందోళనలను దూరం చేసి, అండగా నిలవాలని వారిని కోరారు. ప్రస్తుతం ఐపీఎస్‌ బ్యాచ్‌లోని 174 మంది ప్రొబేషనరీల్లో మహిళా అధికారులు అత్యధికంగా 62 మంది ఉండటంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.  
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)