Breaking News

జీవితఖైదీ భార్యతో డీఐజీ సరసాలు

Published on Wed, 10/07/2026 - 08:20

యశవంతపుర (క‌ర్ణాట‌క‌): బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో అపహరణ, హత్య కేసులో జీవితఖైదు పడిన శంకర్‌ ఆర్ముగం అనే నేరగాడు నకిలీ సుప్రీంకోర్టు తీర్పు కాపీలు సృష్టించి విడుదలైన కేసులో జుగుప్సాకరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో జైళ్ల శాఖ డీఐజీ సోమశేఖర్‌ను పరప్పన అగ్రహార పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా గుట్టు రట్టయింది. పోలీసు వర్గాల సమాచారం మేరకు.. శంకర్‌ను కలవడానికి అతని భార్య తరచుగా జైలుకు వచ్చేది. 

ఆ సమయంలో జైలు సూపరింటెండెంటుగా ఉన్న సోమశేఖర్‌ తన అధికారాన్ని ఉపయోగించుకుని ఆమెతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడు. తరచుగా నగ్న వీడియో కాల్స్‌ చేయించుకునేవాడు. ఇలా శంకర్‌తో కుమ్మక్కయిన అతడు విడుదలకు కుట్ర రూపొందించాడు. జైలులోని క్లర్కు శ్రీకాంత్‌ ద్వారా నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను సృష్టించి, వాటిని శంకర్‌ భార్యకు అందజేశాడు. ఆమె ద్వారా జైలుకు సమర్పించి, ఆమోదింపజేసి జీవితఖైదీని విడుదల చేయించాడు.  

శంకర్‌ రెండో పెళ్లితో..  
తరువాతే వ్యవహారం మలుపు తిరిగింది. 2018 ఆఖరులో విడుదలైన శంకర్‌ భార్యను దూరం పెట్టి, మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన మొదటి భార్య జైళ్ల శాఖ చీఫ్‌కు నకిలీ సుప్రీంకోర్టు తీర్పు గురించి ఉత్తరం రాసింది. దీంతో వ్యవహారం గుట్టురట్టు కావడంతో శంకర్, క్లర్కు శ్రీకాంత్‌లను పోలీసులు గతంలో అరెస్ట్‌ చేశారు. వారి విచారణలో సోమశేఖర్‌ పాత్ర బయటపడింది. ఇక న్యూడ్‌ కాల్స్‌ వీడియోలను పోలీసులు పరీక్షల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. 

ఇదీ చదవండి: రెండు తలల పాము రూ.కోటి

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)