Breaking News

సిసోడియా అమాయ‌కుడు, ఆయ‌న్ను నిందించ‌లేదు: కోర్టులో కేజ్రీవాల్‌

Published on Wed, 06/26/2024 - 17:35

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ బుధ‌వారం సీబీఐ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. మంగళవారం తిహార్‌ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్‌ కోర్టులో ప్రవేశపెట్టాయి. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది.

విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం ర‌ద్దు చేసిన మ‌ద్యం పాల‌సీ కింద న‌గ‌రంలో మ‌ద్యం దుకాణాల ప్రైవేటీక‌ర‌ణ‌కు మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియానే సిఫార్సు చేశార‌ని సీఎం కేజ్రీవాల్ త‌మ విచార‌ణ‌లో చెప్పిన‌ట్లు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియ‌జేశారు.

అయితే సీబీఐ ఆరోప‌ణ‌లు కేజ్రీవాల్ ఖండించారు. మనీష్ సిసోడియా దోషి అని తాను ఎలాంటి ప్రకటన చేయలేద‌ని పేర్కొన్నారు. సిసోడియా పూర్తిగా అమాయకుడని, త‌మ పరువు తీయడమే ద‌ర్యాప్తు సంస్థ‌ల ల‌క్ష్య‌మ‌ని విమ‌ర్శించారు. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించి,   అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

కేజ్రీవాల్‌ తిరస్కరణను తిప్పికొట్టిన సీబీఐ.. తాము వాస్తవాలను మాట్లాడుతున్న‌ట్లు కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ వాద‌న‌లపై కోర్టు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న‌ను తాము చ‌దివామ‌ని ఆయ‌న ఆ విధంగా చెప్ప‌లేద‌ని కోర్టు పేర్కొంది.

ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారని, దానిని సీబీఐ తప్పుగా గ్రహించిందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండ‌గా మ‌ద్యం కుంభ‌కోణం కేసులో సిసోడియాను గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంత‌రం మార్చి 9, 2023న మ‌నీలాండ‌రింకేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)