Breaking News

Dharmasthala: ధర్మస్థళ మిస్టరీ ఉత్కంఠ.. వెలుగులోకి కీలక ఆధారాలు

Published on Thu, 07/31/2025 - 16:52

సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందం గత సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభించగా.. గురువారం ఆరవ స్థలంలో జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలు (skeletal remains) వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం.

1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని చెప్పిన మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక ప్రజలతో ‘భీమ’ అని పిలుచుకుంటున్న పారిశుధ్య కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్‌ ఇప్పటివరకు ఆరు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఐదు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. 

👉ఇదీ చదవండి: ధర్మస్థళ కథేంటీ?

అనూహ్యాంగా ఇవాళ నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ఆరో ప్రాంతంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోర్సెన్సిక్‌ బృందం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని కర్ణాటక ప్రభుత్వం సామూహిక ఖననం కేసులో ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. 

సామూహిక ఖననం కేసులో ఆధారాల్ని సేకరించేందుకు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా, పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ సహా సిట్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా మోహరించారు. ఇక గురువారం మానవ అవశేషాలు దొరికిన ప్రాంతం అంతా నీరు చేరింది. భూమిలోతు తవ్వేకొద్ది నీరు బయటపడుతోంది. ఆ నీటిని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును ఉపయోగిస్తున్నారు. జేసీబీను కూడా ఏర్పాటు చేశారు.  

ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులతో కలసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను జూలై 19న ఏర్పాటు చేసింది. వారు డా. ప్రణవ్ మహంతి ఐపీఎస్, ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్, సౌమ్యలత ఐపీఎస్, జితేంద్ర కుమార్ దయామ ఐపీఎస్. వారికి మరో ఇరవై మంది పోలీసు సిబ్బందిని ఇచ్చింది.

కాగా, కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు