Breaking News

ధర్మస్థళ కేసులో ట్విస్ట్‌.. తవ్వకాల నిలిపివేత

Published on Tue, 08/19/2025 - 08:16

ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు మాట మార్చాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్‌ ఎదుట మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో.. ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతోపాటు తవ్వకాలను ఆపేయాలని సిట్‌ నిరణయించింది. 

‘నాకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా’ అని సోమవారం ఆ వ్యకతి ప్రకటించాడు. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్‌ నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్‌ అధికారి ప్రణబ్‌ మొహంతీ తెలిపారు. మరోవైపు.. 

భీమా, చిన్నయ్యగా కన్నడ మీడియా పిలుస్తున్న ముసుగు మనిషికి లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు సోమవారం డిమాండ్‌ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేని హోంమంత్రి పరమేశ్వర్‌ ప్రకటించారు. యూట్యూబర్లు ఇకపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. 

సిట్‌ తవ్వకాలు నిలిచిపోవడంపైనా ఆయన స్పందించారు. ఇప్పటిదాకా తవ్వకాల్లో దొరికిన అవశేషాల విశ్లేషణ పూర్తై.. ఆ నివేదిక వచ్చేదాకా సిట్‌ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. అయితే.. అది పూర్తిగా సిట్‌ సొంత నిర్ణయమని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారాయన.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)