Breaking News

ఎయిర్‌బస్‌ ‘ఏ320’పై సౌరదాడి

Published on Sun, 11/30/2025 - 04:44

న్యూఢిల్లీ:  ప్రఖ్యాత ఎయిర్‌బస్‌ సంస్థ తయారుచేసిన ఏ320 మోడల్‌ విమానంపై సోలార్‌ రేడియేషన్‌ దాడి చేయడం, తద్వారా సాంకేతిక సమస్య తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మోడల్‌ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. ఎయిర్‌బస్‌ సంస్థ సూచన మేరకు భారత్‌లోని విమానయాన సంస్థలు ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయడం శనివారం ప్రారంభించాయి. 

ఇండిగో, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఏ320 విమానాలను ఉపయోగిస్తున్నాయి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) సమాచారం ప్రకారం.. దేశంలో 338 ఏ320 మోడల్‌ విమానాలు ఉండగా, 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పూర్తయ్యింది. అయితే, ఈ ప్రక్రియ కారణంగా వందలాది ఏ320 విమానాలు 60 నుంచి 90 నిమిషాలపాటు ఆలస్యంగా నడిచాయి. 

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు విమానాలు రద్దయ్యాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకల్లా అన్ని విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పూర్తవుతుందని, తర్వాత విమానాలు యథాతథంగా రాకపోకలు సాగిస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా విమానాశ్రయాల్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.  

ప్రపంచమంతటా ప్రభావం  
ప్రపంచవ్యాప్తంగా 8,100 వరకు ఏ320 మోడల్‌ విమానాలు ఉపయోగంలో ఉన్నాయి. ఇందులో దాదాపు 6,000 విమానాలకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవసరమని గుర్తించారు. కొన్నింటికి హార్డ్‌వేర్‌ కూడా మార్చాల్సి ఉందని అంటున్నారు. ఎయిర్‌బస్‌ సూచన మేరకు సంబంధిత విమానయాన సంస్థలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. శుక్రవారం, శనివారం ప్రపంచమంతటా ఏ320 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

 చాలావరకు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. వారాంతంలోనే ఈ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు 5,000 విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రెడేషన్‌ పూర్తయ్యిందని, అవి తిరిగి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, సాధారణ పరిస్థితి నెలకొందని ఎయిర్‌ బస్‌ ప్రతినిధులు చెప్పారు. మిగిలిన విమానాల్లో సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు.  

అసలేం జరిగింది?  
అక్టోబర్‌ 30న మెక్సికో నుంచి అమెరికాలోని న్యూజెర్సీకి బయలుదేరిన జెట్‌బ్లూ ఎయిర్‌బస్‌ ఏ320 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. విమానం ప్రయాణిస్తున్న ఎత్తు హఠాత్తుగా తగ్గిపోయింది. ఏడు సెకండ్ల వ్యవధిలో విమానం 100 అడుగుల మేర వేగంగా కిందికి దిగింది. దాంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని దారి మళ్లించి, అమెరికాలో ఫ్లోరిడా తీరంలోని తంపా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు.

 సోలార్‌ రేడియేషన్‌ కారణంగా విమానంలో ఎలివేటర్, ఎలిరాన్‌ కంప్యూటర్‌(ఈఎల్‌ఏసీ) వ్యవస్థలో మార్పులు వచి్చనట్లు గుర్తించారు. అందుకే విమానం హఠాత్తుగా కిందికి దిగినట్లు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ320 మోడల్‌ విమానాల్లో ఇలాంటి సమస్యే ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడంతో తక్షణమే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ఎయిర్‌బస్‌ సంస్థ శుక్రవారం సూచించింది. 

లేకపోతే ఫ్లైట్‌ కంట్రోల్‌కు సంబంధించిన డేటా సోలార్‌ రేడియేషన్‌ వల్ల తారుమారయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనిపై డీజీసీఏ వెంటనే స్పందించింది. భారత విమానయాన సంస్థలకు శనివారం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్‌బస్‌ సంస్థ నెదర్లాండ్స్‌ లో రిజిస్టర్‌ అయ్యింది. కానీ, ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ. ఏ320 అనేది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న విమానం.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)