Breaking News

శ్రీరామ భక్తులకు యోగి సర్కార్‌ మరో కానుక!

Published on Thu, 12/14/2023 - 10:10

అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు సమయం సమీపిస్తున్న తరుణంలో యూపీలోని యోగి సర్కారు శ్రీరామభక్తులకు మరో కానుకను ప్రకటించింది. శ్రీరాముడు కొలువైన అయోధ్యలో వాటర్ మెట్రో త్వరలోనే ప్రారంభం కానుంది.  ఇది భక్తులకు వరం కానున్నదని అధికారులు అంటున్నారు. 

త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ వాటర్‌ మెట్రో అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకు ప్రయాణిస్తూ, పర్యాటకులకు అయోధ్య సంస్కృతిని పరిచయం చేయనుంది. దేశంలో ఇది మొట్టమొదటి వాటర్ మెట్రోగా గుర్తింపు పొందనుంది. ఈ వాటర్‌ మెట్రో 2024, జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఇటీవల అయోధ్యలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాటర్‌వేస్ అథారిటీని ఏర్పాటు చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర జలమార్గాలను ప్రోత్సహించడానికి సన్నాహాలు చేశారు.

ఈ వాటర్ మెట్రో సరయూ నదిలో ముందుకు సాగనుంది. ఇది పర్యాటకులను అయోధ్య నుండి గుప్తర్ ఘాట్ వరకూ.. గుప్తర్ ఘాట్ నుండి అయోధ్యకు తీసుకువెళ్లి, తీసుకువస్తుంటుంది. వాటర్ మెట్రోలో 50 అత్యాధునిక సీట్లు ఉండనున్నాయి. దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఘాట్ నుండి మెట్రో వరకు పర్యాటకులు వంతెనగా ఉపయోగించేందుకు రెండు జెట్టీలు కూడా నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)