Breaking News

బాలరామునికి బంగారు, వెండి కానుకల వెల్లువ

Published on Thu, 07/25/2024 - 09:58

అయోధ్యలో కొలువైన బాలరాముని దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారికి అత్యంత విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. బాలరాముడు ప్రతిరోజూ భక్తుల నుంచి కానుకలతోపాటు భారీ మొత్తంలో విరాళాలను కూడా అందుకుంటున్నాడు.

బాలరామునికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు కానుకలుగా అందుతున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ట్రస్ట్ ద్వారా ఇద్దరు సంఘ్ కార్యకర్తలు నియమితులయ్యారు. వీరు ఆభరణాలను విరాళంగా ఇచ్చే భక్తుల పేర్లు, చిరునామా, మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తుంటారు. వీరు షిఫ్టుల వారీగా పనిచేస్తుంటారు. భక్తుల నుంచి అందిన ఆభరణాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్‌లో జమచేస్తారు.

భక్తులు విరాళాల కౌంటర్ వద్ద సమర్పించే నగదును కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. రామ్ లల్లా ఆభరణాలకు రక్షణ అందించేందుకు రిటైర్డ్‌ ఆర్మీ జవానును నియమించారు. ఆయన ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రామ్ లల్లాను అలంకరించినప్పుడు లాకర్ నుండి నగలను తీసి, సంబంధిత పూజారులకు అందిస్తారు. తిరిగి రాత్రిపూట వాటిని భద్రపరుస్తారు. ఆభరణాలకు రక్షణగా ఇద్దరు గన్నర్లు  రోజుకు మూడు షిఫ్టుల్లో కాపలాగా ఉంటారు. ఆలయంలో భద్రత కల్పించేందుకు  20 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)