Breaking News

ఉద్దవ్‌ ఠాక్రేపై మహారాష్ట్ర సీఎం కీలక వ్యాఖ్యలు

Published on Sun, 01/11/2026 - 16:40

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే, శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేల వైరుధ్యాలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్‌ ఠాక్రేపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ శిండే, ఉద్దవ్‌ ఠాక్రేలతో ఎవరితో పనిచేయడం తేలిక అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి ఫడ్నవీస్ బదులిస్తూ  ఉద్దవ్‌తో పని చేయడం చాలా టఫ్‌ జాబ్‌ అన్నారు.

మహారాష్ట్రలో త్వరలో బృహత్‌ ముంబై మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని నగరంలో జరిగే ఎన్నికలు కావడంతో వీటిని అన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఓ నేషనల్‌ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా శివసేన ( యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే గురించి ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫడ్నవీస్ మాట్లాడుతూ" శిండేతో వ్యవహారం చాలా తేలిక ఎందుకంటే ఆయన ఎమోషనల్ వ్యక్తి, నేను కూడా ఎమోషనల్ వక్తినే కనుక ఇది జరుగుతుంది. భావోద్వేగంతో అర్థం చేసుకుంటే శిండేతో వ్యవహారం చాలా సులభం. అయితే ఆయన కంటే నేను ఎక్కువ ప్రాక్టికల్ వ్యక్తిని, అదే ఉద్దవ్‌ ఠాక్రే విషయానికోస్తే ఆయన ఎవరికీ అర్థం కారు. ఆయనను అర్థం చేసుకోవాలంటే ఒక స్కాలర్‌ని అపాయింట్ చేసుకోవాలి. అందుకే ఆయనతో వ్యవహారం చాలా కష్టమైన పని" అని ఫడ్నవీస్ అన్నారు.

ప్రస్తుతం తమ ఎన్డీయే అలయెన్స్‌లో ఎటువంటి విభేదాలు లేవని స్థిరంగా ఉందని వచ్చే ఐదేళ్లతో పాటు దాని తర్వాత కూడా కలిసే తాము కలిసే ఉంటామని ఫడ్నవీస్ అన్నారు. 2019కి ముందు  శివసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేది. 2019లో ఎన్డీఏ నుంచి విడిపోయి కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం 2022లో శివసేన నేత ఏక్ నాథ్ శిండే పార్టీని చీల్చి బీజేపీతో జతకట్టి సీఎం అయ్యారు. 2023లో అసలైన  శివసేన ఏక్‌నాథ్ శిండేదేనని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)