Breaking News

ఏఐ నకిలీ వార్తల సూత్రధారుల భరతం పట్టండి

Published on Mon, 09/15/2025 - 05:43

న్యూఢిల్లీ: కృత్రిమమేథ(ఏఐ)తో సృష్టించిన నకిలీ వార్తలు సమాజంపై పెను దుష్ప్రభావం చూపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పరిష్కార కొరడాతో ముందుకు రావాలని ప్రసార, సమాచార సాంకేతికతపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఉద్భోదించింది. ఏఐతో సృష్టించిన నకిలీ వార్తల విస్తృతి కట్టడికి ఏఐతో అడ్డుకట్టవేయాలని ఈ మేరకు ఏఐను పూర్తిస్తాయిలో వినియోగించుకోవాలని సంబంధిత ముసాయిదా నివేదికలో స్టాండింగ్‌ కమిటీ సూచించింది. 

‘తప్పుడు సమాచారం ఎక్కడ ఉందో తెల్సుకునేందుకు సాంకేతికతను ఉపయోగించాలి. కానీ ప్రస్తుత సమాజంలో తప్పుడు సమాచారానికి సాంకేతికతనే సృష్టికర్తగా మారిన దురవస్థ దాపురించింది’అని ముసాయిదా ఆవేదన వ్యక్తంచేసింది. బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే సారథ్యంలోని స్టాండింగ్‌ కమిటీ ఇటీవలే తన నివేదికను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేసింది.

 ‘ఏఐతో నకిలీ వార్తలను తామరతుంపరగా సృష్టించి అన్ని సామాజిక మాధ్యమాల్లోకి వెదజల్లుతున్న సృష్టికర్తల ఆచూకీ కనిపెట్టి వాళ్ల భరతం పట్టాలి. ఈ క్రతువులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలసికట్టుగా పనిచేయాలి. ఏఐ నకిలీ వార్తలను రూపొందిస్తున్న వ్యక్తులు, సంస్థలను చట్టం ముందు నిలబెట్టేలా పటిష్టమైన న్యాయ, సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి’అని  సూచించింది. 

శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి
‘‘మంత్రిత్వశాఖల మధ్య అంతర్గత సహకారం ఉంటే ఏఐ కంటెంట్‌ సృష్టికర్తలకు ఏఐ జనిత వీడియోలు, సమాచారంపై లైసెన్సుల జారీపై మరింత పట్టు సాధించగలరు. ఏఐ వీడియోలు, కంటెంట్‌పై ఇది ఏఐ జనితం అనే లేబుల్‌ను కచ్చితంగా ముద్రించాలనే నిబంధనను తు.చ. తప్పకుండా అమలుచేయాలి’ అని సూచించింది. నకిలీ సమాచారం జాడ కనిపెట్టడం, కట్టడిచేయడం, తొలగించడం వంటి విధుల్లో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ సాంకేతికతలను విరివిగా వాడాల్సిన తరుణమిది అని నివేదిక అభిప్రాయపడింది. ఏఐ నకిలీ వార్తలను సృష్టించడం, ప్రచారంచేయడం వంటి నేరాలకు కఠిన శిక్షలను అమలుచేసేలా నేరశిక్షాస్మృతిలో సవరణలు చేయడం, జరిమానా మొత్తాలను  పెంచడం వంటివి చేయాలని సూచించింది. 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)